Telugu Global
Cinema & Entertainment

Thandel | తండేల్ ప్రపంచం ఇదే

Thandel - తండేల్ షూటింగ్ ఇలా మొదలైందో లేదో అప్పుడే గ్లింప్స్ రిలీజ్ చేశారు. సినిమా థీమ్ బయటపెట్టారు.

Thandel | తండేల్ ప్రపంచం ఇదే
X

‘తండేల్’ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. సినిమ థీమ్ తో పాటు పాత్రల్ని కూడా పరిచయం చేశారు. చేపలు పట్టడానికి సముద్రం మధ్యలో ఉన్న యువ సామ్రాట్ నాగచైతన్య పాత్రను పరిచయం చేయడంతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది.

‘ఈపాలి యేట..గురి తప్పేదెలేదేస్...ఇక రాజులమ్మ జాతరే’ అని చైతు చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. అయితే అనుకోకుండా, వారు పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించినప్పుడు, వారిని కరాచీలోని సెంట్రల్ జైలులో బంధిస్తారు, అక్కడ వారికి కఠినమైన శిక్షలు విధిస్తారు.

జైలర్ జాతీయవాదాన్ని ప్రశ్నించినప్పుడు, హీరో "భారత్ మాతా కీ జై..." అంటూ చెప్పిన పెద్ద డైలాగ్ ఆకట్టుకుంటోంది. రాజు ప్రేమికురాలిగా సాయి పల్లవి పోషించిన బుజ్జి తల్లి పాత్రని కూడా గ్లింప్స్ లో పరిచయం చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ మత్స్యకారుడు, పాకిస్తాన్ తీర రక్షక దళానికి అనుకోకుండా పట్టుబడిన కథ ఇది.

నాగచైతన్య మునుపెన్నడూ చూడని రస్టిక్ అవతార్‌లో కనిపించాడు. శ్రీకాకుళం యాసని అద్భుతంగా పలికాడు. చైతు ప్రీ-ప్రొడక్షన్‌కి మంచి సమయాన్ని కేటాయించాడు, ఇందులో మాండలికం,బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.

సాయిపల్లవి అందంగా కనిపించింది. ప్రేమకథ నెక్స్ట్ లెవల్ లో ఉంది. వీరిద్దరూ కలిసి కనిపించనప్పటికీ, చైతు మాటలు, సాయి పల్లవి ఎక్స్ ప్రెషన్ ద్వారా సినిమాలో వీరిద్దరూ ఎలాంటి కెమిస్ట్రీని పంచుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతోంది.

First Published:  6 Jan 2024 5:13 PM GMT
Next Story