Telugu Global
Cinema & Entertainment

ఆ వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నా - నాగబాబు

ఆపరేషన్ వాలంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తాను మాట్లాడిన మాటలను వెనక్కు తీసుకుంటున్నట్లు నాగబాబు తెలిపారు.

ఆ వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నా - నాగబాబు
X

వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలంటైన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆరడుగులు ఉన్నవాళ్లు మాత్రమే పోలీస్ క్యారెక్టర్ కు సూట్ అవుతారని నాగబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలకు నాగబాబు తాజాగా క్షమాపణలు చెప్పారు.

వరుణ్ తేజ్ ప్రస్తుతం శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఆపరేషన్ వాలంటైన్ అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో వరుణ్ మిలటరీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగబాబు మాట్లాడుతూ.. 'పోలీస్ క్యారెక్టర్ లో నటించాలంటే. 5.3 అడుగులు ఉంటే బాగుండదు. 6.3 అడుగులు ఉంటేనే బాగుంటుంది. ఐదడుగులు ఉండి నేను స్ట్రిక్ట్ పోలీస్ ని అని ఎవరైనా అంటే కామెడీగా ఉంటుంది. నువ్వు కాదు లేరా బాబు అనిపిస్తుంది.

అదే ఆరడుగుల వ్యక్తి పోలీస్ క్యారెక్టర్ చేస్తూ ఊరికే అలా నిలబడినా వీడిలో ఏదో ఉంది అనిపిస్తుంది' అని నాగబాబు వ్యాఖ్యానించారు. ఆరడుగుల పైన ఉన్నవారు మాత్రమే పోలీస్ క్యారెక్టర్ కు సూట్ అవుతారని నాగబాబు చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి.

ఈ విషయమై తాజాగా నాగబాబు స్పందించారు. ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ఆపరేషన్ వాలంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తాను మాట్లాడిన మాటలను వెనక్కు తీసుకుంటున్నట్లు నాగబాబు తెలిపారు. ఎవరైనా తన మాటలకు నొచ్చుకొని ఉంటే క్షమాపణలు చెబుతున్నట్లు చెప్పారు. యాదృచ్ఛికంగా అన్న మాటలే కానీ.. కావాలని అన్న మాటలు కాదన్నారు. తనను అందరూ అర్థం చేసుకొని క్షమిస్తారని ఆశిస్తున్నట్లు నాగబాబు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.


First Published:  29 Feb 2024 9:33 AM GMT
Next Story