Telugu Global
Cinema & Entertainment

Naa Saami Ranga Teaser | యాక్షన్ తో పాటు లవ్ కూడా..!

Naa Saami Ranga Teaser - నాగ్ హీరోగా నటిస్తున్న నా సామిరంగా టీజర్ వచ్చేసింది. యాక్షన్ తో పాటు లవ్ కూడా ఉంది.

Naa Saami Ranga Teaser | యాక్షన్ తో పాటు లవ్ కూడా..!
X

మొన్నటివరకు ఆ సినిమాపై ఎన్నో అనుమానాలు. సంక్రాంతికి వస్తుందా రాదా అంటూ కథనాలు. అసలు రేసులో లేదంటూ ఊహాగానాలు. అన్నింటికీ చెక్ పెట్టాడు నాగ్. వరుస పెట్టి అప్ డేట్స్ తో ప్రచారాన్ని పరుగులుపెట్టించాడు. ఈరోజు ఏకంగా టీజర్ రిలీజ్ చేసి మరీ రేసులో ఉన్నానంటూ ప్రకటించాడు. నా సామిరంగ టీజర్ రిలీజైంది. సంక్రాంతికి వస్తున్నట్టు మరోసారి ప్రకటన కూడా వచ్చేసింది.

ఇక టీజర్ విషయానికొస్తే.. నా సామిరంగ సినిమా కేవలం యాక్షన్ మూవీ కాదనే విషయం అర్థమౌతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో యాక్షన్ డోస్ తో పాటు లవ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా హీరోహీరోయిన్లు 8 ఏళ్ల నుంచి మాట్లాడుకోవడం లేదనే పాయింట్ ను టీజర్ లో ఎస్టాబ్లిష్ చేశారు.

మాస్ అవతార్ లో నాగార్జున మరోసారి మెప్పించాడు. అతడి లుక్స్, యాక్షన్ బాగున్నాయి. ఇక కీలక పాత్రల్లో నటించిన రాజ్ తరుణ్, అల్లరి నరేష్ కు కూడా టీజర్ లో చోటిచ్చారు. వాళ్ల పాత్రలు ఎంత కీలకం అనే విషయాన్ని మాత్రం టీజర్ లో చెప్పలేదు.

కేవలం స్టోరీలైన్, థీమ్ చెప్పడానికి టీజర్ ను బాగా వాడుకున్నారు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, శివేంద్ర సినిమాటోగ్రఫీ టీజర్ కు మంచి లుక్ అండ్ ఫీల్ తీసుకొచ్చాయి. టీజర్ రిలీజ్ తో ఈ సినిమా, మిగతా సంక్రాంతి సినిమాలకు గట్టి పోటీగా నిలిచింది.

First Published:  17 Dec 2023 11:11 AM GMT
Next Story