Telugu Global
Cinema & Entertainment

Chakravyuham - మైత్రీ మూవీస్ చేతికి మరో చిన్న సినిమా

Chakravyuham - 2వ తేదీన విడుదలకు సిద్ధమైన చక్రవ్యూహం అనే చిన్న సినిమాకు పెద్ద బ్యాకప్ దొరికింది.

Chakravyuham - మైత్రీ మూవీస్ చేతికి మరో చిన్న సినిమా
X

విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు అజయ్. ఇప్పుడీ నటుడు ప్రధాన పాత్ర పోషించాడు. ఆ సినిమానే చక్రవ్యూహం. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌ ఇది. ది ట్రాప్ అనేది ట్యాగ్ లైన్. ఇప్పుడీ ప్రాజెక్టులోకి మైత్రీ మూవీ మేకర్స్ ఎంటరైంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేయబోతున్నారు. జూన్ 2 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది.

జూన్ 2న గట్టి పోటీ ఉంది. తేజ డైరక్ట్ చేసిన అహింస సినిమా వస్తోంది. ఇక రానా ప్రమోట్ చేస్తున్న పరేషాన్ అనే మూవీ కూడా ఉంది. వీటితో పాటు మైత్రీ బ్యాకప్ తో చక్రవ్యూహం సినిమా వస్తోంది. ఈ సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందో చూడాలి.

చక్రవ్యూహం ఫస్ట్ లుక్‌ని స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ రిలీజ్ చేయగా.. ట్రైలర్ ను హీరో సాయిధరమ్ తేజ్ రిలీజ్ చేశాడు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం లో అజయ్ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమాకు కథ-స్క్రీన్ ప్లే హైలెట్ అంటున్నాడు అజయ్.

First Published:  30 May 2023 12:04 PM GMT
Next Story