Telugu Global
Cinema & Entertainment

Sasivadane | మైత్రీ నుంచి మరో చిన్న సినిమా

Sasivadane - శశివదనే ఓ చిన్న సినిమా. ఇప్పుడీ సినిమాకు పెద్ద సపోర్ట్ దక్కింది.

Sasivadane | మైత్రీ నుంచి మరో చిన్న సినిమా
X

భారీ సినిమాలు నిర్మించడమే కాదు, బయట సినిమాల్ని విడుదల చేసేందుకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా ఏర్పాటుచేసింది మైత్రీ మూవీ మేకర్స్. తాజాగా మంజుమ్మల్ బాయ్స్ ను తెలుగులో విడుదల చేసిన ఈ సంస్థ, ఇప్పుడు మరో సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకుంది.

పలాస ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’. ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వ‌హించారు.

ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నైజాం ఏరియా పంపిణీ రైట్స్ ను మైత్రీ దక్కించుకుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

రీసెంట్ టైమ్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన మైత్రీ సంస్థ ఇప్పుడు ‘శశివదనే’ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయనుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. శరవణన్ వాసుదేవన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు.

First Published:  7 April 2024 5:05 PM GMT
Next Story