Telugu Global
Cinema & Entertainment

రామ్ చరణ్ సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్

శంకర్ సినిమా నుంచి రామ్ చరణ్ కు కాస్త గ్యాప్ దొరికింది. ఈ గ్యాప్ లో తన కొత్త సినిమా పనుల్ని వేగవంతం చేశాడు ఈ మెగాహీరో.

రామ్ చరణ్ సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్
X

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. దీనికి సంబంధించి సంగీత దర్శకుడు తమన్ తో ఎప్పుడో మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగాయి. 3 పాటల షూటింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడు ఫ్రెష్ గా మరోసారి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టాడు చరణ్. అయితే ఈసారి శంకర్ సినిమా కాదు, కొత్త సినిమా.

అవును.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాకు అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి గౌతమ్-అనిరుధ్ కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టారు.

నిజానికి ఈ కార్యక్రమం ఇప్పుడు జరగాల్సింది కాదు. అనుకోని విధంగా రామ్ చరణ్, శంకర్ సినిమా ఆగింది. కమల్ హాసన్ తో చేయాల్సిన ఇండియన్-2 కోసం శంకర్, గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ గ్యాప్ లో గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టుకు మెరుగులు దిద్దుతున్నాడు చరణ్. పనిలో పనిగా సంగీత చర్చలు కూడా మొదలుపెట్టాడు.

ప్రస్తుతం తెలుగులోనే ఎన్టీఆర్ సినిమాకు వర్క్ చేస్తున్నాడు అనిరుధ్. ఈ సినిమాతో పాటు చరణ్ సినిమా వర్క్ కూడా స్టార్ట్ చేశాడు. యూవీ క్రియేషన్స్, ఎంవీఆర్ సినిమాస్ బ్యానర్లపై రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫిక్స్ చేయలేదు.

First Published:  18 Aug 2022 9:59 AM GMT
Next Story