Telugu Global
Cinema & Entertainment

Kushi Movie | మ్యూజిక్ సిట్టింగ్స్ అలా జరిగాయి!

Kushi Movie - ఖుషి సినిమా పెద్ద హిట్టవుతుందని చెబుతున్నాడు సంగీత దర్శకుడు హేషమ్. సినిమా ఆఫర్ ఎలా వచ్చిందో వెల్లడించాడు.

Kushi Movie | మ్యూజిక్ సిట్టింగ్స్ అలా జరిగాయి!
X

ఖుషి సినిమా పాటలు పెద్ద హిట్టయ్యాయి. ఈ సినిమాకు మలయాళీ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించాడు. ఈ సినిమా పాటలు పెద్ద హిట్టవ్వడం వెనక దర్శకుడు, హీరో ఇచ్చిన సూచనలు-సలహాలు బాగా హెల్ప్ అయ్యాయంటున్నాడు హేషమ్.

"శివ నిర్వాణ మ్యూజిక్ గురించి తెలిసిన ప్యాషన్ దర్శకుడు. అతనికి ఏం కావాలో తెలిసిన దర్శకుడు. మేం ఒక హోటల్ లో నెల రోజుల పాటు మ్యూజిక్ సిట్టింగ్స్ చేశాం. నేను ఎక్కువ రోజులు ఒక సినిమాకు పనిచేసింది కూడా ‘ఖుషి’కే. హీరో విజయ్ కు తన సినిమాల నుంచి ఆడియన్స్ ఎలాంటి మ్యూజిక్ కోరుకుంటారో తెలుసు. అందుకే తన సలహాలు నాకు చెప్పేవాడు. అవి చాలా హెల్ప్ అయ్యాయి. ఒక టీమ్ మెంబర్ గా మ్యూజిక్ లో తన ఇన్వాల్వ్ మెంట్ ఉండటం మంచిదే."

మలయాళంలో హృదయం అనే సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు హేషమ్. ఆ టైమ్ లోనే ఖుషి టీమ్ నుంచి కాల్ వచ్చిందని తెలిపాడు. ఈ సినిమా ఆఫర్ ఎలా వచ్చిందో వివరించాడు.

"నా మలయాళ హిట్ ఫిల్మ్ హృదయం రిలీజైన తర్వాత మైత్రీ సంస్థ నుంచి పిలుపు వచ్చింది. ఖుషి సినిమాకు వర్క్ చేయమని అడిగారు. శివ గారు చెప్పిన కథ విన్నాక ఒక బ్యుటిఫుల్ మూవీకి వర్క్ చేయబోతున్నా అని అర్థమైంది. వెంటనే ఈ ప్రాజెక్ట్ అంగీకరించాను. సినిమాకు పనిచేయడం ఒక థ్రిల్లింగ్ ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి మొత్తం మ్యూజిక్ వర్క్ కంప్లీట్ చేసేవరకు చాలా హ్యాపీ అనిపించింది."

ఈ సినిమాతో తెలుగులో కూడా క్లిక్ అవుతాననే ఆశాభావం వ్యక్తం చేశాడు హేషమ్. ఈ మ్యూజిక్ డైరక్టర్ ఇప్పటికే పలు తెలుగు సినిమా ఆఫర్లు అందుకున్నాడు.

First Published:  27 Aug 2023 1:53 PM GMT
Next Story