Telugu Global
Cinema & Entertainment

Mr. X - మరో మల్టీస్టారర్ మొదలు

Mr. X Movie - ఆర్య, గౌతమ్ కార్తీక్ హీరోలుగా వస్తున్న సినిమా మిస్టర్-ఎక్స్. ఈ మూవీని ఈరోజు లాంచ్ చేశారు.

Mr. X - మరో మల్టీస్టారర్ మొదలు
X

స్టార్ హీరోలు ఆర్య, గౌతమ్ కార్తీక్ ప్రధాన పాత్రలో మను ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియన్ మూవీ “మిస్టర్ X. ప్రముఖ నటి మంజు వారియర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అనఘ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు జరిగాయి.

ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కొన్ని వారాల క్రితం విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ని అందుకుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ఎఫ్‌ఐఆర్’ ఫేమ్ మను ఆనంద్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

"మిస్టర్ X” యాక్షన్ సన్నివేశాల్ని భారతదేశం, ఉగాండా, అజర్‌బైజాన్, జార్జియా దేశాల్లో చిత్రీకరిస్తారు. స్టంట్ సిల్వా యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ధిబు నినాన్ థామస్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా, తన్వీర్ మీర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రసన్న జీకే ఎడిటర్.

మిస్టర్ X తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తారు

First Published:  21 Jun 2023 3:16 PM GMT
Next Story