Telugu Global
Cinema & Entertainment

ప్రొడ్యూసర్‌‌గా ధోనీ.. ఫస్ట్ సినిమా డీటెయిల్స్ ఇవే..

ధోనీ ఎంటర్‌‌టైన్‌మెంట్స్ నుంచి మొదటి సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని ధోనీ భార్య సాక్షి కన్ఫర్మ్ చేశారు. నిర్మాణ సంస్థ బాధ్యతలు కూడా ధోనీ భార్య సాక్షి చేపట్టబోతోందట.

ప్రొడ్యూసర్‌‌గా ధోనీ.. ఫస్ట్  సినిమా డీటెయిల్స్ ఇవే..
X

దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న ధోనీ ఇప్పుడు సినిమా అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేయబోతున్నాడు. సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టబోతున్నట్టు అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశాడు. 'ధోనీ ఎంటర్‌‌టైన్‌మెంట్స్' పేరుతో తమిళ, తెలుగు, మలయాళం, హిందీ సినిమాలను నిర్మించబోతున్నాడు. ఇంతకీ మొదటి సినిమా వివరాలేంటంటే..

ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడటం ద్వారా దక్షిణాది అభిమానులకు, ముఖ్యంగా తమిళ్ ఫ్యాన్స్‌కు మరింత చేరువయ్యాడు ధోనీ. అందుకే తన మొదటి సినిమా తమిళ డైరెక్టర్‌‌తో చేయబోతున్నాడు. దీని గురించి గతంలోనే హింట్ ఇచ్చాడు. చెన్నైలో ఒక ఈవెంట్‌లో పాల్గొన్న మహేంద్ర సింగ్ ధోని 'త్వరలోనే మీకో గుడ్ న్యూస్ చెప్పబోతున్నా' ఆని చెప్పాడు. అన్నట్టుగానే తన మొదటి సినిమాను అనౌన్స్ చేశాడు.

ధోనీ ఎంటర్‌‌టైన్‌మెంట్స్ నుంచి మొదటి సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని ధోనీ భార్య సాక్షి కన్ఫర్మ్ చేశారు. నిర్మాణ సంస్థ బాధ్యతలు కూడా ధోనీ భార్య సాక్షి చేపట్టబోతోందట. అంతేకాకుండా మొదటి సినిమా కథను కూడా ఆమె అందించినట్లు తెలిపారు. ఈ సినిమాకు తమిళ దర్శకుడు రమేశ్ తమిళమణి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈసినిమా తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయాలని చూస్తున్నారు. సినిమాలో నటించబోయే హీరో హీరోయిన్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

First Published:  27 Oct 2022 6:55 AM GMT
Next Story