Telugu Global
Cinema & Entertainment

Mrunal Thakur | కాఫీ ఉంటే చాలు

Mrunal Thakur - తను చురుగ్గా పనిచేయాలంటే కాఫీ కావాలంటోంది మృణాల్. కాఫీనే తన బలహీనత అంటోంది.

Mrunal Thakur | కాఫీ ఉంటే చాలు
X

ప్రతి ఒక్కరికి ఓ వీక్ నెస్ ఉంటుంది. దీనికి హీరోహీరోయిన్లు కూడా అతీతం కాదు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు కూడా అలాంటి ఓ వీక్ నెస్ ఉంది. తన బలహీనతను బయటపెట్టింది ఈ స్టార్ హీరోయిన్.

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వీక్ నెస్ కాఫీ. వేడివేడి కాఫీ కడుపులో పడకపోతే తనకు ఏదోలా ఉంటుందని, అస్సలు పనిపై దృష్టిపెట్టలేనని చెబుతోంది. పనిలో తను ఏకాగ్రతగా ఉండాలంటే, ముందుగా కాఫీ తాగుతానని తెలిపింది.

సెట్స్ లో తనకు ఏం ఉన్నా లేకపోయినా, కాఫీ మాత్రం అందుబాటులో ఉండాలని చెబుతోంది ఈ బ్యూటీ. తన టీమ్ కు ఆ విషయం బాగా తెలుసని, అందుకే ఎప్పుడూ కాఫీని అందుబాటులో ఉంచుతారని, ఇదే విషయాన్ని సినిమా యూనిట్ కు కూడా చెబుతారని అంటోంది.

ప్రస్తుతం ఈ చిన్నది, విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తోంది. ఆచితూచి సినిమాలు చేస్తున్న మృణాల్.. ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ తర్వాత మరిన్ని సినిమాలు సైన్ చేయబోతోంది.

First Published:  5 Feb 2024 4:10 PM GMT
Next Story