Telugu Global
Cinema & Entertainment

Mrunal Thakur age | మృణాల్ ఠాకూర్ వయసు ఎంతో తెలుసా?

Mrunal Thakur age | ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ హోదాలో కొనసాగుతోంది మృణాల్ ఠాకూర్. ఇంతకీ ఈమె వయసెంతో తెలుసా?

Mrunal Thakur age | మృణాల్ ఠాకూర్ వయసు ఎంతో తెలుసా?
X

Mrunal Thakur age | మృణాల్ ఠాకూర్ వయసు ఎంతో తెలుసా?

Mrunal Thakur age | నటి మృణాల్ ఠాకూర్ తన వయస్సు ఇంకా 16 ఏళ్లు మాత్రమే అంటోంది. మహారాష్ట్రలో పుట్టిపెరిగిన ఆమె సీతారామం చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ప్రస్తుతం నాని సరసన హాయ్ నాన్న, విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేస్తోంది. వీటిలో హాయ్ నాన్న సినిమా విడుదలకు సిద్ధమైంది.

డిసెంబర్ మొదటి వారంలో థియేటర్లలోకి రాబోతున్న హాయ్ నాన్న సినిమా కోసం ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా మృణాల్ కోసం గూగుల్ లో ఎక్కువమంది అడిగిన ప్రశ్నల్ని ఆమె ముందుంచాడు నాని. వాటికి ఆసక్తికర సమాధానాలిచ్చింది ఈ హీరోయిన్. మరీ ముఖ్యంగా తన వయసు బయటపెట్టింది.

మృణాల్ వయసెంత అనే ప్రశ్న గూగుల్ లో బాగా పాపులర్ అయింది. దీనిపై మృణాల్ సరదాగా స్పందించింది. ముందుగా తన వయసు 16 ఏళ్లు మాత్రమే అని జోక్ చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తన అసలు వయసును 31 ఏళ్లుగా చెప్పుకొచ్చింది. అంటే, మృణాల్ కూడా 3 పదుల వయసు దాటేసిందన్నమాట.

30 ఏళ్లు దాటినా తానింకా పెళ్లి చేసుకోలేదని, సింగిల్ గానే ఉన్నానని ఆమె ప్రకటించింది. సరైన టైమ్ లో, సరైన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటానని చెబుతోంది. చాలామందిలా మృణాల్ కూడా డాక్టర్ అవుదాం అనుకొని యాక్టర్ అయింది. డెంటిస్ట్ కోర్సు చేసేందుకు కాలేజ్ లో జాయిన్ అయి, మొదటి ఏడాది పూర్తవ్వకుండానే వదిలేసి, సినిమాల్లోకి వచ్చేసింది.

First Published:  1 Nov 2023 5:00 PM GMT
Next Story