Telugu Global
Cinema & Entertainment

Mrunal Thakur | మరో క్రేజీ సినిమాలో సీతారామం బ్యూటీ

Mrunal Thakur ShivaKarthikeyan - కోలీవుడ్ పై కన్నేసింది సీతారామం బ్యూటీ. త్వరలోనే శివకార్తికేయన్ సరసన నటించనుంది.

Mrunal Thakur age | మృణాల్ ఠాకూర్ వయసు ఎంతో తెలుసా?
X

Mrunal Thakur age | మృణాల్ ఠాకూర్ వయసు ఎంతో తెలుసా?

సీతారామం సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్, తన పరిధిని మరింత విస్తృతం చేస్తోంది. టాలీవుడ్ తో పాటు ఇప్పుడు కోలీవుడ్ పై కూడా కన్నేసింది ఈ బ్యూటీ, ఇందులో భాగంగా ఓ క్రేజీ మూవీలో నటించేందుకు అంగీకరించింది.

మురుగదాస్ దర్శకత్వంలో హీరో శివకార్తికేయన్ ఓ సినిమాకు రెడీ అవుతున్నాడట. కెరీర్ లో శివకార్తికేయన్ కు ఇది 22వ చిత్రం. ఈ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ పేరును పరిశీలిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించబోతున్నాడు.

రీసెంట్ గా వచ్చిన మావీరన్ (మహావీరుడు) సినిమాతో కోలీవుడ్ లో హిట్ కొట్టాడు శివకార్తికేయన్‌. తన తదుపరి చిత్రంగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో శివకార్తికేయన్‌కు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఈ మూవీ తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ నటిస్తాడనే టాక్ కోలీవుడ్ లో జోరుగా నడుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై, అందులో మృణాల్ ఠాకూర్ ఎంట్రీపై అధికారిక ప్రకటన రానుంది.

First Published:  5 Aug 2023 8:48 AM GMT
Next Story