Telugu Global
Cinema & Entertainment

Mrunal | ముంబయిలో ఫ్లాట్ కొనుగోలు చేసిన మృణాల్

Mrunal Thakur - ముంబయిలోని ఖరీదైన ప్రాంతంలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసింది మృణాల్. అది కంగనా రనౌత్ కుటుంబానికి చెందిన ఆస్తి.

Mrunal | ముంబయిలో ఫ్లాట్ కొనుగోలు చేసిన మృణాల్
X

మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్. "హాయ్ నాన్న" విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఇప్పుడీ ముద్దుగుమ్మ, తను సంపాదించే డబ్బుతో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతోంది.

ఆమె ముంబైలోని అంధేరిలో కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది, ఇది గతంలో నటి కంగనా రనౌత్ తండ్రి అమర్‌దీప్ రనౌత్, ఆమె సోదరుడికి చెందిన ఉమ్మడి ఆస్తి.

మృనాల్ ప్రస్తుతం అంధేరిలోని అద్దె అపార్ట్ మెంట్ లో ఉంటోంది. అదే సొసైటీలో రనౌత్ తండ్రి, సోదరుడికి 2 ఫ్లాట్స్ ఉన్నాయి. వీటిలో 17వ అంతస్తులో ఉన్న ఫ్లాట్ ను మృణాల్ కొనుగోలు చేసింది.

తాజా సమాచారం ప్రకారం.. సదరు ఫ్లాట్ లో తన అభిరుచికి తగ్గట్టు మృణాల్ ఇప్పటికే ఇంటీరియర్ పనులు మొదలుపెట్టింది. వెస్ట్ ముంబయికి చెందిన ప్రముఖ బ్రోకర్ సాగర్ భారతి ద్వారా ఈ లావాదేవీ జరిగింది.

తెలుగు, హిందీ భాషల్లో బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతోంది మృణాల్. ఆమె నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది. విజయ్ దేవరకొండ ఇందులో హీరో.

First Published:  23 Feb 2024 3:18 AM GMT
Next Story