Telugu Global
Cinema & Entertainment

Hi Nanna | హాయ్ నాన్న డివైన్ స్టోరీ అంటున్న హీరోయిన్

Hi Nanna - హాయ్ నాన్న సినిమాలో పవిత్రమైన స్టోరీ ఉందంటోంది మృణాల్. ఇంకా ఏం అంటోందంటే...!

Hi Nanna | హాయ్ నాన్న డివైన్ స్టోరీ అంటున్న హీరోయిన్
X

హాయ్ నాన్న సినిమాతో మరోసారి తెలుగుతెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది మృణాల్ ఠాకూర్. నేచురల్ స్టార్ నాని సరసన 'హాయ్ నాన్న' సినిమా చేసింది. వైర ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషించింది. బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సినిమా గురించి మాట్లాడింది. హాయ్ నాన్న సినిమాను పవిత్రమైన కథగా చెబుతోంది.

"సీతారామం, హాయ్ నాన్న.. దేనికవే ప్రత్యేకమైన చిత్రాలు. సీతారామం 60, 70దశకంలో జరిగే కథ. హాయ్ నాన్న నేటి తరాన్ని ప్రతిభింబించే కథ. ఇందులో నా పాత్ర కూడా న్యూ ఏజ్ అమ్మాయిగా ఉంటుంది. నా పాత్రలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. యష్ణ పాత్రలో చాలా లేయర్స్ ఉంటాయి. హాయ్ నాన్న హ్యూమన్ రిలేషన్స్, ఎమోషన్ ని అద్భుతంగా ప్రజంట్ చేస్తుంది. హాయ్ నాన్న అద్భుతమైన కథ. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ సినిమా స్టోరీ డివైన్. షూటింగ్ చేస్తున్నప్పుడు అదే భావనతో నటించాను."

ఇలా హాయ్ నాన్న సినిమా పై స్పందించింది మృణాల్. సీతారామంతో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. హాయ్ నాన్నతో కచ్చితంగా హిట్ కొట్టాలి. ఎందుకంటే, టాలీవుడ్ కెరీర్ లో ఆమెకిది రెండో సినిమా.

First Published:  5 Dec 2023 2:45 PM GMT
Next Story