Telugu Global
Cinema & Entertainment

Mr Bachchan | మిస్టర్ బచ్చన్ షూటింగ్ అప్ డేట్స్

Mr Bachchan - రవితేజ కొత్త సినిమా మిస్టర్ బచ్చన్. ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ చూద్దాం..

Mr Bachchan | మిస్టర్ బచ్చన్ షూటింగ్ అప్ డేట్స్
X

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా 'మిస్టర్ బచ్చన్'. పీపుల్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా టీం ఒక కీలక షెడ్యూల్ ని పూర్తి చేసింది. రవితేజతో పాటు ఇతర తారాగణం పై సినిమాలోని చాలా ముఖ్యమైన సన్నివేశాలని ఈ షెడ్యూల్ లో చిత్రీకరించారు. అనంతరం 'మిస్టర్ బచ్చన్' టీం, 'ఈగిల్' సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంది.

రవితేజ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్న ఈ సినిమా ట్యాగ్‌లైన్ 'నామ్ తో సునా హోగా'. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పనోరమా స్టూడియోస్, టి-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాయి.

ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈగల్ తర్వాత రవితేజ నుంచి రాబోతున్న సినిమా ఇదే.

First Published:  11 Feb 2024 2:40 PM GMT
Next Story