Telugu Global
MOVIE REVIEWS

S5 No Exit Movie Review: 'ఎస్ 5- నో ఎగ్జిట్' మూవీ రివ్యూ! {1.5/5}

S5 No Exit Movie Review: నందమూరి తారకరత్న హీరోగా ఇంకో ప్రయత్నం చేశాడు. 2002 లో ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ తో ప్రారంభమై, హీరోగా ఐదారు సినిమాలు చేసి కలిసిరాక, సహాయ పాత్రలేయడం ప్రారంభించాడు. తిరిగి 2021 లో హీరోగా ‘దేవినేని’, ‘సారధి’ నటించి ప్రయోజనం లేకపోయినా, ‘ఎస్ 5- నో ఎగ్జిట్’ తో హీరోగా కంటిన్యూ అయ్యాడు.

S5 No Exit Movie Review: ఎస్ 5- నో ఎగ్జిట్ మూవీ రివ్యూ! {1.5/5}
X

చిత్రం : 'ఎస్ 5- నో ఎగ్జిట్'

రచన -దర్శకత్వం: సన్నీ కోమలపాటి

తారాగణం: తారకరత్న, ప్రిన్స్, సాయి కుమార్, అవంతికా హరి, సునీల్, అలీ, మెహబూబ్, రఘు, ఫిష్ వెంకట్ తదితరులు

సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం : గరుడవేగ అంజి

బ్యానర్: శౌరీ ఎంటర్ టైన్ మెంట్స్

నిర్మాత: ఆదూరి ప్రతాప్ రెడ్డి

విడుదల : డిసెంబర్ 30, 2022

రేటింగ్ : 1.5/5


నందమూరి తారకరత్న హీరోగా ఇంకో ప్రయత్నం చేశాడు. 2002 లో 'ఒకటో నెంబర్ కుర్రాడు' తో ప్రారంభమై, హీరోగా ఐదారు సినిమాలు చేసి కలిసిరాక, సహాయ పాత్రలేయడం ప్రారంభించాడు. తిరిగి 2021 లో హీరోగా 'దేవినేని', 'సారధి' నటించి ప్రయోజనం లేకపోయినా, 'ఎస్ 5- నో ఎగ్జిట్' తో హీరోగా కంటిన్యూ అయ్యాడు. దీంతో బాటు విడుదలైన 'టాప్ గేర్' తో ఆది సాయికుమార్ రివర్స్ గేర్ లో వెళ్ళాడు. మరి తారకరత్న 'నో ఎగ్జిట్' తో హీరోగా ఎగ్జిట్ అయ్యాడా, లేక నో ఎంట్రీ అన్పించుకున్నాడా రివ్యూలో కెళ్ళి చూద్దాం...

కథ

అధికార ప్రజాసేవ పార్టీ (ఎపిపి) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి సుబ్రహ్మణ్యం నాయుడు (సాయికుమార్) తన కొడుకు సుబ్బు (తారకరత్న) పుట్టిన రోజుకి సికిందరాబాద్ నుంచి వైజాగ్ ట్రైన్‌లో ఎస్ 5 బోగీ మొత్తం బుక్ చేసి పార్టీ జరుపుకునేలా చేస్తాడు. ఈ బోగీలో సుబ్బు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూంటే (ప్రిన్స్) తన డ్యాన్స్ టీంతో పొరపాటున ప్రవేశిస్తాడు. దీంతో సుబ్బు సన్నీలకి గొడవలవుతాయి. ఈ క్రమంలో బోగీలో కొందరు మాయమవడ

మేగాక బోగీకి మంటలంటుకుంటాయి. దీంతో సుబ్బు అతడి ఫ్రెండ్స్ బయటికి దూకి ప్రాణాలు కాపాడుకుంటారు.

ఎస్ 5 బోగీలో కొందరు అదృశ్యమవడం, మంటలంటుకోవడం వెనుక మిస్టరీ ఏమిటి? బోగీలో దెయ్యం వుందా? అసలు సీఏం ఎందుకు ఈ బోగీని బుక్ చేశాడు? బోగీలో దాచిన 3 వేల కోట్ల రూపాయలు ఎవరివి? అవేమయ్యాయి? సుబ్రహ్మణ్యం నాయుడు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే ప్రయత్నాలు ఫలించాయా? ఈ ప్రశ్నలకి సమాధానాలు తర్వాతి కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

ఎత్తుగడ వరకూ అన్ని కథలూ అద్భుతాలే. ఆ తర్వాతే ఎత్తుకున్న కథని కింద ఎత్తేసి చేతులెత్తేస్తారు. ఎత్తుగడతో రేటింగ్ 3 స్టార్ గా వుంటే, దాన్ని లాగడంలో సింగిల్ స్టార్ కి, 1.5 స్టార్ కీ వచ్చేస్తారు. ఈ దీన పరిస్థితి లోంచే తారకరత్న నటించిన మరో కథ. తనకి నో ఎంట్రీ రాసిపెట్టి వున్న కథ. నృత్యదర్శకుడు దర్శకుడుగా మారి లోనుజేసిన వ్యధ. దీన్ని హార్రర్ థ్రిల్లర్ గా ప్రారంభించాడు దర్శకుడు. హార్రర్ థ్రిల్లర్ గా బోగీలో జరిగే సంఘటనలు చూసి ప్రేక్షకులు సీట్లకి అతుక్కుపోవడం ఖాయం. అయితే ప్రశ్నలు రేకెత్తిస్తూ ఈ సంఘటనల పరంపర కొనసాగుతూండగానే, హార్రర్ ఫీల్ ని కిల్ చేసి, అలీ పాత్రతో కామెడీ చేసేశాడు. దీంతో ఇంటర్వెల్ ముందునుంచీ సెకండాఫ్ సాంతం అభాసు అయింది కథ. సెకండాఫ్ లో సునీల్ కామెడీ పాత్ర ఎంట్రీతో థ్రిల్, సస్పెన్స్, హార్రర్ అలా వుంచి, అసలు కథే పట్టాలు తప్పింది. తిరిగి క్లయిమాక్స్ లో పట్టాలెక్కాక రివీల్ చేసిన కథ, దాని ముగింపూ చూస్తే ఇంత సిల్లీ పాయింటుతో ఫూల్స్ చేస్తారాని కోపం రాక మానదు!

రాజకీయ థ్రిల్లరా, హార్రరా, కామెడీయా ఏం తీయాలో స్పష్టతలేక సిల్లీ సీన్లు తీసి కలగాపులగం చేసి వదిలాడు. ఆ మాటకొస్తే ఏం నటిస్తున్నామో తెలియక నటీనటులు కూడా ఫూల్స్ అయ్యారు.

నటనలు- సాంకేతికాలు

తారకరత్న కొత్త లుక్ తో ఆకర్షిస్తాడు. ఆ లుక్ తో, నటనతో పాత్రపట్ల ఆసక్తి రేకెత్తిస్తాడు. ప్రధాన పాత్రగా అతడి ప్రారంభ గోల్ బర్త్ డే పార్టీ జరుపుకోవడం. కానీ బోగీలో సంఘటనలతో ప్రమాదంలో పడ్డాక ఆ సంఘటనల్ని ఎదుర్కోవడం గోల్ కావాల్సి వుండగా, కాకపోవడంతో పాత్రతో బాటు తానూ మాయమై పోయాడు. ఈ సినిమాలో తనెందుకు

న్నాడో అర్ధం గానట్టు అయోమయంగా చూడ్డం వరకే పాత్ర. డైలాగులు కూడా క్లయిమాక్స్ లోనే వుంటాయి. 20 ఏళ్ళ అనుభవం గల తను హీరోగా ఎంపిక చేసుకున్నది ఇలాటి పాత్ర!

సాయి కుమార్ ముఖ్యమంత్రి పాత్ర కూడా ఆసక్తి రేకెత్తిస్తూ ప్రారంభమయి కుదేలై పోతుంది. ఇక ప్రిన్స్ సరేసరి. ఇంకోటేమిటంటే, తారకరత్న సహా ప్రతి వొక్కరూ డైలాగులు అరిచి చెప్తారు. అంతా గోలగోలగా వుంటుంది.

నిర్మాణ విలువలు పూర్ గా వున్నాయి. గ్రాఫిక్స్ కి కూడా బడ్జెట్ చాల్లేదు. కెమెరా, సంగీతం ఏవరేజ్. దర్శకత్వం ఎలావున్నా కొత్త దర్శకుడిగా ఉత్సాహం కూడా కన్పించదు. బోగీ సెట్ వేయడంలో చూపినంత ఉత్సాహం బోగీలో షూట్ చేసేటప్పుడు లేకపోవడం శోచనీయం.

First Published:  31 Dec 2022 10:02 AM GMT
Next Story