Telugu Global
Cinema & Entertainment

ప్రేమ వివాహం.. 20 ఏళ్ల తర్వాత విడాకులు

ఇదొక చిన్న సినిమా. కానీ టీజర్ చూస్తే మనసుకు హత్తుకుంటుంది. ఇందులో పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ సినిమా ఏంటో.. టీజర్ ఏంటో మీరూ చూసేయండి

Month of Madhu Movie
X

మంత్ ఆఫ్ మధు

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలన్నీ సుఖంగా ఉండడం లేదు. అందులో కొన్ని జంటలు విడిపోతున్నాయి. కొంతమంది ఏడాదికే విడిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇది కూడా అలాంటి జంటే. కాకపోతే ప్రేమించి, పెళ్లి చేసుకున్న 20 ఏళ్ల తర్వాత విడిపోయారు. 20 ఏళ్లు కాపురం చేసిన ఓ ప్రేమ జంట విడిపోవడానికి కారణం ఏంటి? అదేంటో తెలియాలంటే మంత్ ఆఫ్ మధు సినిమా చూడాల్సిందే.

నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి జంటగా నటించిన సినిమా ఇది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. పైన మనం చెప్పుకున్న మేటర్ మొత్తం టీజర్ లో ఉంది. ఒక్క 'ఆ కారణం' తప్ప. టీజర్ చాలా రియలిస్టిక్ గా ఉంది. తాగుబోతు మధుగా నవీన్ చంద్ర పెర్ ఫెక్ట్ గా సూటయ్యాడు. ఇక మధ్యతరగతి అమ్మాయిగా, గృహిణిగా స్వాతి సరిగ్గా సరిపోయింది.

టీజర్ లో డైలాగ్స్ చాలా బాగున్నాయి. "20 ఏళ్ల బాధను 20 నిమిషాల్లో చెప్పలాంటే చెప్పలేం, చెప్పే ఉద్దేశం కూడా లేదు" లాంటి డైలాగ్స్ హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. టీజర్ కు అచ్చు రాజమణి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ గా సాగింది.

సినిమాలో రాజారవీంద్ర, హర్ష, మంజుల ఘట్టమనేని లాంటి చాలామంది ఆర్టిస్టులున్నప్పటికీ, టీజర్ ను హీరోహీరోయిన్ల ఎమోషనల్ బాండింగ్ వరకు మాత్రమే పరిమితం చేశారు. గతంలో నవీన్ చంద్రతో భానుమతి రామకృష్ణ సినిమాను నిర్మించిన యశ్వంత్, ఈ సినిమాను కూడా నిర్మించాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు.



First Published:  29 Sep 2022 11:49 AM GMT
Next Story