Telugu Global
Cinema & Entertainment

Kannappa | కన్నప్ప లో మరో సూపర్ స్టార్

Kannappa - మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప. ఇందులో మోహన్ లాల్ కూడా చేరారు.

Kannappa | కన్నప్ప లో మరో సూపర్ స్టార్
X

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాపై వస్తున్న అప్ డేట్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. రోజురోజుకూ కన్నప్ప మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా సినిమాగా కన్నప్పను మంచు విష్ణు భారీ స్థాయిలో రూపొందిస్తున్నాడు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.

మంచు విష్ణు ఈ సినిమాను భారీ ఎత్తున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో కన్నప్ప సినిమా రాబోతోంది. ఈ మూవీలో ప్రభాస్ కూడా ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్ ఈ సినిమాలోకి వచ్చారు. మల్లూవుడ్ సూపర్ స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ సైతం కన్నప్ప సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నారు.

ఈ మేరకు మంచు విష్ణు రీసెంట్‌గా మోహన్ లాల్‌ను కలిశారు. ఇద్దరి మధ్య కథాచర్చలు ముగిశాయి. కన్నప్పలో కీలక పాత్ర పోషించేందుకు మోహన్ లాల్ అంగీకరించారు. దీంతో ఈ విషయాన్ని మంచు విష్ణు అధికారికంగా ప్రకటించాడు. మోహన్ లాల్ తో దిగిన ఫోటోను కూడా షేర్ చేశాడు. ఈ మేరకు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం కన్నప్ప టీం న్యూజిలాండ్‌లో ఉంది. పరుచూరి గోపాలకృష్ణ, విజయేంద్ర ప్రసాద్, తోటపల్లి సాయినాథ్ లాంటి వ్యక్తుల సహకారంతో ఈ స్క్రిప్ట్‌ను అద్భుతంగా మలిచినట్టు మంచు విష్ణు తెలిపాడు. ఈ సినిమాలో వివిధ భాషలకు చెందిన సూపర్ స్టార్స్ నటిస్తారనే విషయాన్ని మంచు విష్ణు ఇదివరకే ప్రకటించాడు. చెప్పినట్టుగానే ప్రభాస్ ను లైన్లోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు మోహన్ లాల్ కూడా వచ్చారు. త్వరలోనే ఈ లిస్ట్ లోకి నయనతార కూడా చేరబోతోందనే ప్రచారం నడుస్తోంది. సో... కన్నప్ప ప్రాజెక్టు భారీ స్టార్ కాస్ట్ తో మెప్పించబోతోందన్నమాట.

First Published:  30 Sep 2023 5:40 PM GMT
Next Story