Telugu Global
Cinema & Entertainment

Miss Shetty Mr Polishetty | వీడియో బాగుంది, ఆడియో బాలేదు

Miss Shetty Mr Polishetty - తాజాగా మరో సాంగ్ రిలీజైంది. ఫుల్ వీడియో ఇది. అయితే వీడియో బాగుంది కానీ ఆడియో బాగాలేదు.

Miss Shetty Mr Polishetty | వీడియో బాగుంది, ఆడియో బాలేదు
X

న‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఆగ‌స్ట్ 4న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. తాజాగా ఈ చిత్రం నుంచి లేడీ లక్ అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేశారు.

సాధారణంగా రిలీజ్ చేసే లిరికల్ వీడియో లాంటిది కాదిది. పూర్తిస్థాయిలో వీడియో సాంగ్ ఇది. ఈ పాట ఇలా విడుదలైందో లేదో అలా లక్షల్లో వ్యూస్ తెచ్చుకుంది. దీనికి కారణం అనుష్క. లాంగ్ గ్యాప్ తర్వాత తెరపై కనిపించిన అనుష్కను చూడ్డానికి ఈ వీడియో సాంగ్ ను చాలామంది వీక్షించారు. అంతేతప్ప, ఆడియోలో పెద్దగా విషయం లేదు.

ఈ సినిమా సాంగ్ చాలా సాదాసీదాగా ఉంది. లేడీ లక్ అంటూ సాగే పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా.. కార్తిక్ ఆలపించాడు. రధన్ బాణీ అందించాడు. ఆడియో బాగాలేకపోయినా, వీడియో సాంగ్‌లో నవీన్ పొలిశెట్టి ఎనర్జీ, అనుష్క చార్మింగ్ లుక్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇక స్టార్ హీరో ధనుష్ పాడిన పాట చార్ట్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అన్విత ర‌వళి శెట్టి పాత్ర‌లో అనుష్క‌.. స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌ సిద్ధు పొలిశెట్టి పాత్ర‌లో న‌వీన్ పొలిశెట్టి పాత్ర‌లు మ‌న‌సుల‌ను హ‌త్తుకునేలా రూపొందించారట మేకర్లు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఆగస్ట్ 4న ఈ చిత్రం విడుద‌ల‌కాబోతోంది.



First Published:  11 July 2023 3:19 AM GMT
Next Story