Telugu Global
Cinema & Entertainment

Miss Shetty Mr Polishetty - పొలిశెట్టి-అనుష్క టీజర్ అదిరింది

Miss Shetty Mr Polishetty - నవీన్ పొలిశెట్టి, అనుష్క హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి. ఈ సినిమా టీజర్ రిలీజైంది.

Miss Shetty Mr Polishetty - పొలిశెట్టి-అనుష్క టీజర్ అదిరింది
X

బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న స్వీటీ అనుష్క శెట్టి, తక్కువ సినిమాలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న జాతిరత్నం నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రానికి పి. మహేష్ కుమార్ దర్శకుడు. రీసెంట్ గా విడుదల చేసిన ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ లిరికల్ సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. లేటెస్ట్ గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ టీజర్ ను విడుదల చేశారు.

ఈ మూవీ ఒక చెఫ్, ఒక స్టాండప్ కమెడియన్ మధ్య సాగే కథగా ఆల్రెడీ చెప్పారు. టీజర్ లో దాన్ని మరింత ఎంటర్టైనింగ్ గా చూపించారు. రవళి పాత్రలో నటించిన అనుష్క ప్రొఫెషనల్ చెఫ్. పెళ్లంటే ఇష్టం ఉండదు. ఆ విషయంలో ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇటు పేరెంట్స్ కు ఇష్టం లేకపోయినా స్టాండప్ కమెడియన్ గా రాణించాలని ప్రయత్నించే మరో కుర్రాడు. ఈ ఇద్దరికీ అనుకోకుండా పరిచయమై ఆ పరిచయం స్నేహంగా మారుతుంది. మరి ఆ స్నేహం ఏ తీరాలకు చేరింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అన్నట్టుగా ఉందీ టీజర్.

హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ముఖ్యంగా అనుష్క.. నవీన్ ను ఇంటర్వ్యూ చేస్తూ.. నీ స్ట్రెంత్ ఏంటీ అని అడుగుతుంది.. అందుకు నవీన్ ‘అవకాశం ఉన్నప్పుడల్లా కామెడీ చేస్తుంటా’ అని చెబుతాడు.. వీక్ నెస్ గురించి అడిగితే.. ‘సిట్యుయేషన్ కు సంబంధం లేకుండా కామెడీ చేస్తుంటా’ అని చెప్పే డైలాగ్ ఫన్నీగా ఉంది.

తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి రథన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు.



First Published:  30 April 2023 5:19 PM GMT
Next Story