Telugu Global
Cinema & Entertainment

Miss Shetty Mr Polishetty | ఆగస్ట్ లో వస్తున్న శెట్టి జోడీ

Miss Shetty Mr Polishetty - అనుష్క, నవీన్ పొలిశెట్టి నటిస్తున్న ఈ సినిమాకు తాజాగా విడుదల తేదీ ఖరారు చేశారు.

Miss Shetty Mr Polishetty | ఆగస్ట్ లో వస్తున్న శెట్టి జోడీ
X

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, న‌వీన్ పొలిశెట్టి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఆగ‌స్ట్ 4న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ‘భాగమతి’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత అనుష్క న‌టిస్తోన్న చిత్రం ఇది. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, 2 సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అందులో ఓ పాట‌ను కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ పాడ‌టం విశేషం. ఈ క్ర‌మంలో తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ అనౌన్స్ చేశారు.

అన్విత ర‌వళి శెట్టి పాత్ర‌లో అనుష్క‌.. స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌ సిద్ధు పొలిశెట్టి పాత్ర‌లో న‌వీన్ పొలిశెట్టి ఇందులో కనిపించనున్నారు. ఇదొక ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ అంటున్నారు మేకర్స్.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో అనుష్క కొంత భాగం గర్భవతిగా కనిపించనుంది. పెళ్లి కాకుండానే, ఆమె ఎందుకు గర్భం దాల్చింది, నవీన్ పొలిశెట్టి ఆమెకు ఎలాంటి సహాయం చేశాడనేది ఈ సినిమా స్టోరీ అని సమాచారం. రధన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  3 July 2023 1:05 PM GMT
Next Story