Telugu Global
Cinema & Entertainment

Miss Shetty Mr Polishetty | అనుష్క, నవీన్ పొలిశెట్టి సినిమా వచ్చేస్తోంది

Miss Shetty Mr Polishetty - నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రిలీజ్ డేట్ లాక్ చేశారు.

Miss Shetty Mr Polishetty | అనుష్క, నవీన్ పొలిశెట్టి సినిమా వచ్చేస్తోంది
X

నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా రూపొందుతోన్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ఓసారి వాయిదా పడింది. ఇప్పుడీ సినిమాకు కొత్తగా మరో విడుదల తేదీ లాక్ చేశారు

సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతోంది అనుష్క కొత్త సినిమా. తాజాగా ఈ విషయాన్ని ప్రకటించిన మేకర్స్, ఓ కొత్త పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాతో మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌ుడిగా పరిచయమౌతున్నాడు. వంశీ, ప్ర‌మోద్‌ నిర్మాతలు.

ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా హీరో నవీన్ పోలిశెట్టి చేసిన స్పెషల్ వీడియో ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో జ్యోతిష్యుడిగా రంగస్థలం మహేశ్ కనిపించాడు. జ్యోతిష్కుడ్ని 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' రిలీజ్ డేట్ చెప్పమని నవీన్ అడగడం, అతను 70, 80 ఏళ్ల తర్వాత రిలీజ్ చేసుకోమని అనడం.. చివరకు నవీన్ పోలిశెట్టి హే కృష్ణా అంటూ ఉట్టికొట్టి కృష్ణాష్టమికి మా సినిమాను తీసుకొస్తున్నాం అని ప్రకటించడం ఇంట్రెస్టింగ్ గా, సరదాగా ఉంది.

ప్రతి సినిమాకు తనదైన స్టయిల్ లో ప్రచారం చేయడం నవీన్ పొలిశెట్టి స్టయిల్. ఈ సినిమాకు కూడా అతడు విభిన్నంగా ప్రచారం స్టార్ట్ చేశాడు. త్వరలోనే మరింత కొత్తగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నాడు.

'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. సెప్టెంబర్ 7న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ గా మూవీ రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం ఉండటంతో, తమ సినిమాకు ఈ హాలిడే సీజన్ కలిసొస్తుందని యూనిట్ భావిస్తోంది.

First Published:  15 Aug 2023 4:02 AM GMT
Next Story