Telugu Global
Cinema & Entertainment

Miss Shetty Mr Polishetty | అనుష్క సినిమా వాయిదా

Miss Shetty Mr Polishetty - నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా వాయిదా పడింది. ఆగస్ట్ 4న రిలీజ్ కావడం లేదు.

Miss Shetty Mr Polishetty | అనుష్క సినిమా వాయిదా
X

వైవిధ్య‌మైన పాత్ర‌లో న‌టుడిగా త‌న‌కంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు న‌వీన్ పొలిశెట్టి. ఇక అనుష్క గురించి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్ నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమా ప్రచారం ఆల్రెడీ మొదలైంది. కొన్ని సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఆగస్ట్ 4న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడా ప్లాన్స్ అన్నీ ఆగిపోయాయి.

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా వెల్లడించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం వల్ల సినిమాను సకాలంలో రిలీజ్ చేయలేకపోతున్నామని, క్షమించమంటూ నోట్ విడుదల చేశారు. దీంతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా పోస్ట్ పోన్ అయింది. మళ్లీ ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారనేది త్వరలోనే వెల్లడిస్తారు.

యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ‘భాగమతి’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత అనుష్క న‌టిస్తోన్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ . సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. అందుకు త‌గిన‌ట్లు ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, రెండు సాంగ్స్ రిలీజ్ కాగా.. వాటికి ఆడియెన్స్ నుంచి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. అందులో ఓ పాట‌ను కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ పాడ‌టం విశేషం. ఈ క్ర‌మంలో ట్రయిలర్ ను విడుదల చేసి, సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు. అంతలోనే సినిమా విడుదల వాయిదా పడింది.

First Published:  29 July 2023 1:56 PM GMT
Next Story