Telugu Global
Cinema & Entertainment

Miss Shetty Mr Polishetty | వినాయకుడ్ని కూడా వదలని పొలిశెట్టి

Miss Shetty Mr Polishetty - ఖైరతాబాద్ వినాయకుడ్ని దర్శించుకున్నాడు హీరో నవీన్ పొలిశెట్టి. సినిమా హిట్టయినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాడు.

Miss Shetty Mr Polishetty | వినాయకుడ్ని కూడా వదలని పొలిశెట్టి
X

తన సినిమాలకు నవీన్ పొలిశెట్టి ఏ రేంజ్ లో ప్రచారం చేస్తాడనేది అందరికీ తెలిసిన విషయమే. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విడుదలై 10 రోజులైనా ఇంకా ఈ హీరో తన సినిమాకు ప్రచారం కల్పిస్తూనే ఉన్నాడు. ఎక్కడో ఒక చోటు రౌండ్స్ వేస్తూనే ఉన్నాడు.

ఈసారి తన సినిమా ప్రచారానికి ఖైరతాబాద్ వినాయకుడ్ని సైతం వాడుకున్నాడు ఈ హీరో. ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడ్ని దర్శించుకున్న నవీన్, తన సినిమా హిట్ అయినందుకు, దేవుడికి కృతజ్ఞతలు తెలిపాడు.

తాను నటుడు అవ్వాలనే కోరిక వినాయక చవితి ఉత్సవాల్లోనే పుట్టిందని అన్నాడు ఈ యువ హీరో. నవరాత్రి ఉత్సవాల్లో కనిపించే సందడి, అక్కడ జరిగే హంగామా తనలో నటుడు ఉన్నాడని తెలిసేలా చేసిందన్నాడు. వినాయక చవితి సందర్బంగా ఖైరతాబాద్ మహాగణపతిని నవీన్ పొలిశెట్టి దర్శించుకొని పూజలు నిర్వహించాడు. నవీన్ కు ఉత్సవ సమితి సభ్యులు సాదర స్వాగతం పలికి సత్కరించారు.

అనంతరం ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవాల్లో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న నవీన్ పొలిశెట్టి... తన తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విజయవంతమైనందుకు గణేశుడికి కృతజ్ఞలు తెలిపాడు. ఈ ఏడాది కొలువుదీరిన విద్యామహాగణపతి... భక్తులకు మంచి విద్య, ఉన్నతి కల్పించాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నాడు.

నవీన్ పోలిశెట్టి రాకతో ఖైరతాబాద్ గణేశుడి వద్ద సందడి నెలకొంది. ఉత్సవ సమితి సభ్యులతో పాటు పలువురు భక్తులు నవీన్ తో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు.

Next Story