Telugu Global
Cinema & Entertainment

Naa Saami Ranga | నాగార్జున సినిమాలో సెకెండ్ హీరోయిన్

Naa Saami Ranga - నా సామిరంగ సినిమాలో మరో హీరోయిన్ ఉంది. ఆమె ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?

Naa Saami Ranga | నాగార్జున సినిమాలో సెకెండ్ హీరోయిన్
X

కింగ్ నాగార్జున నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెన్ తో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోస్టర్‌లు, ఫస్ట్ టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ నా సామిరంగ నుంచి మంగ పాత్రలో మిర్నా మీనన్ ను పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో మిర్నా మీనన్ సంప్రదాయం ఉట్టిపడే చీరకట్టులో చాలా అందంగా కనిపించారు. ఈ సినిమాలో మిర్నా మీనన్ ఉందనే విషయం, ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేంతవరకు చాలామందికి తెలియదు.

మంచి ప్రేమకథ, స్నేహం, భావోద్వేగాలు, మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ కూడిన నా సామిరంగ సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ. ప్రోమోస్ అన్నీ ప్రామిసింగ్ గా ఉన్నాయి.

ఈ చిత్రంలో నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించాడు. నా సామిరంగ జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది.

First Published:  5 Jan 2024 4:38 PM GMT
Next Story