Telugu Global
Cinema & Entertainment

Prabhas Salaar - సలార్ సినిమాలో ఊహించని ట్విస్ట్

Salaar Movie - సలార్ మూవీలో అదిరిపోయే ట్విస్ట్ ఉందంటున్నారు యూనిట్ జనం. ఆ ట్విస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ లో వస్తుందంటున్నారు.

Prabhas Salaar - సలార్ సినిమాలో ఊహించని ట్విస్ట్
X

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా సలార్. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ మూవీ. ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో ఊహించని ట్విస్ట్ ఒకటి ఉందంట. ఆ ట్విస్ట్ ఇంటర్వెల్ టైమ్ లో వస్తుందట. సినిమాలో ఆ ట్విస్ట్ చూస్తే మతిపోతుందని అంటున్నారు యూనిట్ జనం. సలార్ సినిమాకు అదే ప్రాణం అని చెబుతున్నారు. దీంతో ఆ ట్విస్ట్ ఏంటనే అంశంపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.

కంప్లీట్ మాస్-యాక్షన్ అంశాలతో తెరకెక్కుతోంది సలార్ సినిమా. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంటర్వెల్ ట్విస్ట్ లో ఏదైతే ఊహించని ట్విస్ట్ ఉందో, ఆ ట్విస్ట్ కు శృతిహాసన్ కు సంబంధం ఉందంట. కేవలం ఈ ఎపిసోడ్ కోసమే ఈ సినిమాలో నటించేందుకు శృతిహాసన్ అంగీకరించిందంటున్నారు.

సలార్ సినిమాలో జర్నలిస్ట్ గా కనిపించనుంది శృతిహాసన్. ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. అయినప్పటికీ ఈ సినిమా చేసేందుకు ఆమె అంగీకరించడానికి కారణం, ఇంటర్వెల్ బ్యాంగ్ అని తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి వస్తోంది సలార్ సినిమా.

First Published:  14 March 2023 3:36 PM GMT
Next Story