Telugu Global
Cinema & Entertainment

మహేష్ తో మూవీ పెద్ద సమస్య కాదు

మహేష్ మూవీ చేసే అంశంపై స్పందించాడు దర్శకుడు మెహర్ రమేష్. ప్రస్తుతం చిరంజీవితో భోళాశంకర్ చేస్తున్న ఈ దర్శకుడు.. మహేష్ తో కచ్చితంగా సినిమా చేస్తానంటున్నాడు

మహేష్ తో మూవీ పెద్ద సమస్య కాదు
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇతడితో సినిమా చేయాలని ప్రతి దర్శకుడికి ఉంటుంది. కానీ మహేష్ ను ఒప్పించడం అంత ఈజీ కాదు. ఈ విషయంలో సుకుమార్ లాంటి స్టార్ డైరక్టర్లే ఫెయిల్ అయిన సందర్భాలున్నాయి. అలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న మహేష్ తో సినిమా చేయడం పెద్ద సమస్య కాదంటున్నాడు దర్శకుడు మెహర్ రమేష్.

"మహేష్ తో కచ్చితంగా సినిమా చేస్తాను. మహేష్ సినిమాల్లోకి రాకముందు నుంచే నాకు తెలుసు. ఎప్పటికప్పుడు మేం కలుసుకుంటాం. మహేష్ యాడ్ నేను షూట్ చేశాను. అంతెందుకు, నేను చేస్తున్న భోళాశంకర్ టైటిల్ ను మహేష్ తోనే లాంఛ్ చేయించాను. మహేష్ తో మూవీ చేయడం పెద్ద సమస్య కాదు."

ఇలా మహేష్ తో సినిమాపై స్పందించాడు మెహర్ రమేష్. అయితే ప్రస్తుతం తన కెరీర్ ను భోళాశంకర్ సినిమా వరకు మాత్రమే పరిమితం చేసుకున్నానని, ఆ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేస్తానో తనకు తెలియదని అన్నాడు. తాజాగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన మెహర్.. ఏదో ఒక రోజు పవన్ ను కూడా డైరక్ట్ చేస్తానని చెబుతున్నాడు.

First Published:  24 Oct 2022 11:37 AM GMT
Next Story