Telugu Global
Cinema & Entertainment

హీరోయిన్ నోట్లో సిగరెట్.. చేతిలో హాకీ స్టిక్

ఇన్నాళ్లూ సున్నితమైన పాత్రల్లో మాత్రమే కనిపించింది హీరోయిన్ మేఘా ఆకాష్. మరి ఈ ముద్దుగుమ్మ రెబల్ గా మారితే ఎలా ఉంటుంది?

హీరోయిన్ నోట్లో సిగరెట్.. చేతిలో హాకీ స్టిక్
X

రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న సినిమా "మాటే మంత్రము". ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు. కోట ఫిలిం ఫ్యాక్టరీ, ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందించగా...అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మేఘా ఆకాష్ లుక్ రిలీజ్ చేశారు. రెబల్ కావ్యగా మేఘా ఆకాష్ లుక్ సరికొత్తగా ఉంది. హాకీ స్టిక్ పట్టుకుని స్మోక్ చేస్తున్న కావ్య పాత్రలో మేఘా ఆకాష్ రెబల్ గా కనిపిస్తోంది.

ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుందీ సినిమా. 2 పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. మేఘా ఆకాష్ ను ఇప్పటివరకు సాఫ్ట్ రోల్స్ లో మాత్రమే చూశారు ఆడియన్స్. ఈ సినిమాలో మాత్రం ఆమె ప్రేక్షకులకు చిన్నపాటి షాక్ ఇస్తుందని చెబుతున్నారు మేకర్స్.

గోవా బ్యాక్ డ్రాప్ లో నడిచే రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఇది తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తిస్థాయిలో ప్రచారం ప్రారంభిస్తారు.




First Published:  26 Oct 2022 3:01 PM GMT
Next Story