Telugu Global
Cinema & Entertainment

Megha Akash | మేఘా ఆకాష్ కొత్త సినిమా సంగతులు

Megha Akash - హీరోయిన్ మేఘా ఆకాష్ కొత్త సినిమా స్టార్ట్ చేసింది. ఈసారి హిట్ గ్యారెంటీ అంటోంది.

Megha Akash | మేఘా ఆకాష్ కొత్త సినిమా సంగతులు
X

వరుసపెట్టి సినిమాలు చేస్తోంది ముద్దుగుమ్మ మేఘా ఆకాష్. కానీ ఆశించిన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతోంది. ఈ క్రమంలో సక్సెస్ కొట్టడం కోసం ఆమె తన తల్లితో కలిసి నిర్మాణ రంగంలోకి కూడా ఎంటరైంది. కానీ ఆ ప్రయత్నం కూడా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మేఘా ఆకాష్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మేఘాఆకాశ్ లీడ్ రోల్ లో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకు "సఃకుటుంబ‌నాం" అనే టైటిల్ పెట్టారు. తాజాగా హైదరాబాద్ లో సినిమా ప్రారంభోత్సవం ఘ‌నంగా జరిగింది. హెచ్ఎన్‌జీ మూవీస్ సినిమాస్ బ్యానర్ పై హెచ్‌.మ‌హాదేవ్ గౌడ‌, హెచ్‌.నాగ‌ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉద‌య్‌శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రాబోతోంది "సఃకుటుంబ‌నాం".

ఈ సినిమాలో మేఘా ఆకాశ్ సరసన హీరోగా రామ్ కిరణ్ పరిచయమౌతున్నాడు. హీరో, హీరోయిన్‌ల‌పై చిత్రీక‌రించిన ముహుర్త‌పు స‌న్నివేశానికి ప్ర‌ముఖ కొరియోగాఫ్ర‌ర్ చిన్నిప్ర‌కాష్ కెమెరా స్విచ్చాన్ చేయ‌గా, ప్ర‌ముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం క్లాప్‌నిచ్చారు.

ఈ చిత్రంలో త‌న పాత్ర గురించి విన‌గానే కొత్త హీరో అని చూడ‌కుండా మేఘా ఆకాష్ వెంట‌నే ఒప్పుకుంది. క్లీన్‌ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రాబోతోంది. ఈ చిత్రంలో మేఘా ఆకాష్ పాత్ర పేరు సిరి. ఈ పాత్ర తనకు బాగా న‌చ్చిందని.. ఈ సినిమాలో న‌టించ‌డం ఆనందంగా ఉందని అంటోంది మేఘా.

ఈ సినిమాలో అన్ని ఎమోష‌న్స్ ఉన్నాయంటోంది మేఘా ఆకాష్. సినిమా కాన్సెప్ట్‌ చాలా కొత్తగా ఉంటుందని, అందరికీ నచ్చుతుందని చెబుతోంది. రాజేంద్రప్ర‌సాద్‌, బ్ర‌హ్మానందం, స‌త్య‌, రాహుల్ రామకృష్ణ. ర‌చ్చ‌ ర‌వి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, భ‌ద్రం, ప్ర‌గ‌తి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ‌ సంగీతం అందిస్తున్నాడు. ఉద‌య్‌శ‌ర్మ‌ ఈ సినిమాకు దర్శకుడు మాత్రమే కాదు, ఈ సినిమా కథ కూడా అతడితే. స్క్రీన్ ప్లే-మాటలు కూడా అతడే అందిస్తున్నాడు.

First Published:  24 Sep 2023 5:14 PM GMT
Next Story