Telugu Global
Cinema & Entertainment

Mega 157 | చిరంజీవి సినిమా ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభం

#Mega157 - చిరంజీవి కొత్త సినిమా ప్రీ-ప్రొడక్షన్ మొదలైంది. వశిష్ఠ ఈ సినిమాకు దర్శకుడు.

Mega 157 | చిరంజీవి సినిమా ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభం
X

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్, వశిష్ట దర్శకత్వంలో మెగా మూవీ ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కెరీర్ లో చిరంజీవికి ఇది 157వ చిత్రం. పంచభూతాలతో కూడిన అనౌన్స్ మెంట్ పోస్టర్ భారీ అంచనాల్ని సెట్ చేసింది. ఈ ఫాంటసీ అడ్వెంచర్‌ను యూవీ క్రియేషన్స్‌ వంశీ, ప్రమోద్, విక్రమ్ భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

ఈరోజు చిత్ర దర్శకుడు వశిష్ట సినిమా ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ ప్రారంభించాడు. ఛోటా కె నాయుడు ఈ చిత్రానికి డివోపీగా పని చేస్తారని కూడా ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత, డీవోపి తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు వశిష్ఠ.

నిజానికి చిరంజీవి నుంచి రాబోయే సినిమా ఇది కాదు. ఆయన తన 156వ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకొస్తారు. కూతురు సుశ్మిత నిర్మాతగా ఆ సినిమా రాబోతోంది. కాకపోతే వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న 157వ చిత్రానికి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ఎక్కువగా చేయాల్సి ఉంది. ఎందుకంటే, ఇది ఫాంటసీ అడ్వెంచరస్ మూవీ కాబట్టి.

అందుకే, 156వ సినిమా కంటే ముందు 157వ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారు చిరంజీవి. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పూర్తయి, సెట్స్ పైకి వచ్చేలోపు 156వ సినిమాను పూర్తిచేస్తారు.

First Published:  10 Sep 2023 4:30 PM GMT
Next Story