Telugu Global
Cinema & Entertainment

దీపావళికి మెగా గ్లింప్స్

చిరంజీవి కొత్త సినిమా రెడీ అవుతోంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టీజర్ ను దీపావళికి లాంచ్ చేయబోతున్నారు.

దీపావళికి మెగా గ్లింప్స్
X

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమా టైటిల్ ను అఫీషియల్ గా చెప్పలేదు కానీ చిరంజీవి మాత్రం ఒకట్రెండు సందర్భాల్లో చెప్పేశారు. తాజాగా కూడా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడీ టైటిల్ తోనే ఫస్ట్ లుక్ రాబోతోంది. అంతేకాదు, గ్లింప్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. దీపావళికి ఈ ముహూర్తం లాక్ చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. హీరో రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ డబ్బింగ్ పనులు కూడా మొదలయ్యాయి. 2023 సంక్రాంతికి సినిమా విడుదల కానున్న నేపధ్యంలో షెడ్యూల్ ప్రకారం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

చిరంజీవి కెరీర్ లో 154వ చిత్రంగా వస్తున్న ఈ మూవీపై దేవిశ్రీ ట్వీట్ చేశాడు. ''బాబీ సర్ కి అభినందనలు . మీ కల నిజం కాబోతుంది. దీపావళికి బాస్ ఎక్సయిటింగ్ టీజర్. నేను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తి చేశాను. మీ అందరితో కలిసి మెగా మాస్ ఎంటర్ టైనర్ ను థియేటర్లలో చూడ్డానికి ఆత్రుతగా ఉన్నాను" అని వెల్లడించాడు.

మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రవి, నవీన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

First Published:  15 Oct 2022 7:48 AM GMT
Next Story