Telugu Global
Cinema & Entertainment

రామ్ చరణ్ ఇంట్లో క్రిస్మస్ సంబరాలు.. సీక్రెట్ శాంటాగా వరణ్ తేజ్

వరుణ్ తేజ్ శాంటాలా మారిపోయాడు. అందరూ ఒకరికి ఒకరు గిఫ్టులు ఇచ్చి పుచ్చుకున్నారు.

రామ్ చరణ్ ఇంట్లో క్రిస్మస్ సంబరాలు.. సీక్రెట్ శాంటాగా వరణ్ తేజ్
X

మెగా ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీయే. చిరంజీవి తర్వాతి తరంలో అనేక మంది హీరోలు, సినీ రంగంతో పరిచయం ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి కజిన్స్ అందరూ కలిస్తే సందడి వాతావరణమే నెలకొంటుంది. రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ తమ హీరోయిజాన్ని వదిలి కుటుంబ ఫంక్షన్లలో చాలా ఎంజాయ్ చేస్తుంటారు. పండగలు, స్పెషల్ అకేషన్లు వస్తే వీరి సందడి మామూలుగా ఉండదు. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ నడుస్తోంది. మరో నాలుగు రోజుల్లో క్రిస్మస్ పండుగ జరుగనున్నది. ఈ క్రమంలో రామ్ చరణ్ ఇంట్లో కజిన్స్ అందరూ క్రిస్మస్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.

వరుణ్ తేజ్ శాంటాలా క్యాప్ పెట్టుకున్నాడు. సీక్రెట్ శాంటా పేరుతో అందరూ ఒకరికి ఒకరు గిఫ్టులు ఇచ్చి పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కజిన్స్ అందరూ కలిసి దిగిన గ్రూప్ ఫొటోను రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫొటో చూసి మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్‌తో పాటు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్, బన్నీ భార్య స్నేహారెడ్డి, మెగా డాటర్ నిహారిక, చిరంజీవి కూతుర్లు సుష్మిత, శ్రీజతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.

మోగా ఫ్యామిలీలోని అందరు హీరోలు ఇప్పుడు బిజీగా ఉన్నారు. చిరంజీవి రెండు సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. వాల్తేరు వీరయ్య సంక్రాంతికి విడుదల కానుండగా, మరో సినిమా భోళా శంకర్ సెట్స్ మీద ఉన్నది. ఇక పవన్ కల్యాణ్ 'హర హర వీర మల్లు' షూటింగ్ కంప్లీట్ చేసే హడావిడిలో ఉన్నది. దీంతో పాటు సుజిత్, హరీశ్ శంకర్ సినిమాలు షూటింగ్ ప్రారంభం కావల్సి ఉన్నది.

రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు. పుష్ఫ సినిమాతో దేశమంతటా పరిచయం అయిన అల్లు అర్జున్.. ఇప్పుడు పుష్ఫ-2 సీక్వెల్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. యాక్సిడెంట్ అయిన తర్వాత సాయి ధరమ్ తేజ్ కాస్త జోరు తగ్గించాడు. కానీ త్వరలో సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో చేసిన 'విరూపాక్ష' విడుదల కానున్నది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఇలా మెగా హీరోలు అందరూ బిజీగా ఉన్నసమయంలో క్రిస్మస్ పేరుతో గెట్ టూ గెదర్ ఏర్పాటు చేసుకున్నారు.First Published:  21 Dec 2022 10:50 AM GMT
Next Story