Telugu Global
Cinema & Entertainment

MayaOne | సందీప్ కిషన్ మూవీ అప్ డేట్స్

MayaOne - సందీప్ కిషన్ కొత్త సినిమా మాయా-వన్. ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం.

MayaOne | సందీప్ కిషన్ మూవీ అప్ డేట్స్
X

హీరో సందీప్ కిషన్, క్రియేటివ్ డైరెక్టర్ సివి కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్ హిట్ ప్రాజెక్ట్‌-జెడ్/మాయవన్‌ తర్వాత సెకండ్ పార్ట్ కోసం రెండోసారి చేతులు కలిపారు. 'మాయవన్' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సీక్వెల్ ను ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌ నేపధ్యంలో రూపొందే ఈ చిత్రాన్ని అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పిస్తోంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు, సాహో ఫేమ్ నీల్ నితిన్ ముఖేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సందీప్ కిషన్, నీల్ ఇద్దరూ ఈ సినిమా కోసం మేకోవర్ అయ్యారు.

మాయావన్‌లో సందీప్‌ కిషన్‌ సరసన ఆకాంక్ష రంజన్‌ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. పలు ఓటీటీ సిరీస్‌లలో నటించిన ఆకాంక్ష మాయావన్‌తో వెండితెర ఎంట్రీ ఇస్తోంది. సూపర్‌ విలన్‌తో ఒక సామాన్యుడి ఘర్షణ కథగా ఈ సినిమా ఉండబోతోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు.

First Published:  4 Feb 2024 4:49 PM GMT
Next Story