Telugu Global
Cinema & Entertainment

Mathu Vadalara 2 | మత్తు వదలరా 2 టీజర్ లాంచ్

Mathu Vadalara 2 Teaser - సూపర్ హిట్ మత్తు వదలరా సినిమాకు సీక్వెల్ రెడీ అయింది. టీజర్ హిలేరియస్ గా ఉంది.

Mathu Vadalara 2 | మత్తు వదలరా 2 టీజర్ లాంచ్
X

బ్లాక్ బస్టర్ మత్తు వదలరాకు సీక్వెల్ గా ‘మత్తువదలారా2’ ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతోంది. శ్రీ సింహ కోడూరి లీడ్ రోల్ లో తన సైడ్ కిక్ గా సత్య నటిస్తున్న ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చెర్రీ, హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.

రితేష్ రానా మార్క్ హ్యుమర్ తో టీజర్ ఓపెన్ అయింది. వెన్నెల కిషోర్ కామెడిక్ ప్రెస్ మీట్‌ తర్వాత శ్రీ సింహ, సత్య హీ టీమ్ ఏజెంట్లుగా పరిచయం అయ్యారు. అయితే, ఏజెంట్లు దొంగలుగా మారడం ద్వారా ఊహించని మలుపు చూపించారు. ఇక టీజర్ చివర్లో రితిష్ రానా స్టైల్‌లో టీవీ సీరియల్ ఎపిసోడ్‌తో హిలేరియస్ గా ఎండ్ అయింది.

టీజర్ సూచించినట్లుగా, మత్తు వదలారా2 కథనంలో క్రేజీ మలుపులున్నాయి. శ్రీ సింహ కోడూరి, సత్య పాత్రలు హిలేరియస్ గా ఉన్నాయి. ఫరియా అబ్దుల్లా, సునీల్, అజయ్, రోహిణి తదితరుల పాత్రల ఎంటర్ టైనింగ్ గా ఉన్నాయి. కాల భైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హ్యుమర్ ని మరింత ఎలివేట్ చేసింది. సెప్టెంబర్ 13న సినిమా విడుదల కానుంది.

First Published:  30 Aug 2024 5:09 PM GMT
Next Story