Telugu Global
Cinema & Entertainment

Ratnam Movie | డోంట్ వర్రీ అంటున్న విశాల్

Vishal's Ratnam Movie - రత్నం మూవీ నుంచి మాస్ సాంగ్ రిలీజ్ చేశారు. దేవిశ్రీప్రసాద్ స్వయంగా ఆలపించిన పాట ఇది.

Ratnam Movie | డోంట్ వర్రీ అంటున్న విశాల్
X

విశాల్ అంటే అందరికీ యాక్షన్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. అలాంటిది యాక్షన్ డైరెక్టర్ హరితో విశాల్ మూవీ అంటే యాక్షన్ మూవీ లవర్స్‌కు ఇక పండగే. దానికి తగ్గట్టుగానే ‘రత్నం’ అనే మూవీ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతోంది.

జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. రత్నం చిత్రానికి హరి డైరెక్టర్‌గా, కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్. ఈ మూవీలో విశాల్ హీరోగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

రత్నం ఫస్ట్ షాట్ టీజర్‌, పాటలు ఇలా ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే పాటను రిలీజ్ చేశారు. కాలేజ్‌లో విద్యార్థుల మధ్య రిలీజ్ చేసిన ఈ పాట ఇప్పుడు వైరల్ అవుతోంది.

డోంట్ వర్రీ మచ్చి.. ఎగ్జామ్స్ కోసం డోంట్ వర్రీ మచ్చి.. కష్టాలు వస్తుంటాయ్ పోతుంటాయ్.. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు అనే లిరిక్స్ తో శ్రీమణి ఈ సాంగ్ కు సాహిత్యం అందించగా.. స్వయంగా దేవీ శ్రీ ప్రసాద్‌ ఆలపించడం విశేషం. ఈ సాంగ్ లో విశాల్ తో పాటు యోగిబాబు కూడా డాన్స్ చేశాడు.

రత్నం షూటింగ్ పూర్తయినట్టుగా మేకర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నారు.

First Published:  16 March 2024 8:04 AM GMT
Next Story