Telugu Global
Cinema & Entertainment

మాస్ లుక్ లో అబ్బవరం.. మరో సాంగ్ రిలీజ్

నేను మీకు బాగా కావాల్సినవాడ్ని సినిమా నుంచి మాస్ సాంగ్ రిలీజైంది. మణిశర్మ సంగీత దర్శకుడు.

మాస్ లుక్ లో అబ్బవరం.. మరో సాంగ్ రిలీజ్
X

కిరణ్ అబ్బవరం హీరోగా, సంజన ఆనంద్ హీరోయిన్ గా శ్రీధర్ గాదె దర్శకత్వంలో వస్తున్న సినిమా "నేను మీకు బాగా కావాల్సినవాడిని". కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై కోడి రామ‌కృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎస్ఆర్ కల్యాణమండపం సక్సెస్ తర్వాత కిరణ్ అబ్బవరం, శ్రీధర్ గాదె కలిసి చేస్తున్న ప్రాజెక్టు కావడంతో, ఈ మూవీపై అంచనాలు పెరిగాయి.

రాజావారి రాణిగారు, ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం.. ఇందులో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి "నచ్చావ్ అబ్బాయి" పాట విడుదలైంది. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి ఓ మోస్తరు రెస్పాన్స్ వస్తోంది..

మాస్ బీట్ తో సాగే "నచ్చావ్ అబ్బాయి " పాటలో కిరణ్ అబ్బవరం వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం మాస్ లుక్ లో అంద‌ర్ని ఆక‌ట్టుకుంటున్నాడు.

ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఆడియోని ల‌హ‌రి ద్వారా మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు. సినిమాలో మొత్తం 6 పాటలున్నాయి. సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ సినిమా.



First Published:  15 Aug 2022 8:17 AM GMT
Next Story