Telugu Global
Cinema & Entertainment

ఈ పాటలో నానిని గుర్తుపట్టగలరా?

నాని హీరోగా నటిస్తున్న సినిమా దసరా. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా మాస్ సాంగ్ ను విడుదల చేశారు.

ఈ పాటలో నానిని గుర్తుపట్టగలరా?
X

"తన ప్రతి సినిమాలో ఒకేలా కనిపిస్తాడు.. పెద్దగా మేకోవర్ కోసం ప్రయత్నించడు." నానిపై తరచుగా వచ్చే విమర్శ ఇది. దసరా సినిమాతో దీనికి చెక్ పెట్టబోతున్నాడు నాని. అతడి లుక్, ఆహార్యం మొత్తం మారిపోయింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ లో నాని అవతారం చూశారు ప్రేక్షకులు. ఇక తాజాగా విడుదలైన పాటలో నాని మాస్ గెటప్ చూసి ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది అయితే ఆ సాంగ్ లో నాని ఎక్కడున్నాడో కూడా గుర్తుపట్టలేకపోయారంటే, అతడు ఎంతలా మేకోవర్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు.

నాని చేస్తున్న పాన్ ఇండియా చిత్రం 'దసరా'. ఈ సినిమా నుంచి ధూమ్ ధామ్ దోస్తాన్ పాటను మేకర్స్ విడుదల చేశారు. తెలంగాణ శైలి జానపదంతో పాట ప్రారంభమైంది. తన టీమ్, బ్యాండ్ లో ఎనర్జీని నింపడానికి కి మద్యం బాటిల్‌ను అందిస్తాడు నాని. తర్వాత, డప్పులతో బీట్స్‌ పెంచడంతో ధూమ్ ధామ్ దోస్తాన్ అనేది మాస్ లోకల్ స్ట్రీట్ సాంగ్ గా మారింది.

పాటలో నాని క్యారెక్టర్ లుక్, మేకోవర్‌ మునుపెన్నడూ చూడని విధంగా ఉంది. నాని, అతని బ్యాచ్ మాస్ డ్యాన్స్ తో బొగ్గు గనుల్లో దుమ్ము రేపారు. సంతోష్ నారాయణ్ ఈ పాటను కంపోజ్ చేయగా, రాహుల్ సిప్లిగంజ్, పాలమూరు జంగిరెడ్డి, నర్సమ్మ, గొట్టె కనకవ్వ, గన్నోర దాసు లక్ష్మి పాడారు. తెలంగాణా స్టైల్‌లో కాసర్ల శ్యామ్ ఈ పాటను ఆకట్టుకునేలా రాశారు.

First Published:  4 Oct 2022 3:43 AM GMT
Next Story