Telugu Global
Cinema & Entertainment

మసూద టీజర్.. మరో హారర్ మూవీ

మసూద అనే సినిమా వస్తోంది. పేరుకు చిన్న సినిమానే అయినప్పటికీ, ఆసక్తి రేకెత్తిస్తోంది. తాజాగా టీజర్ రిలీజైంది.

Masooda Movie
X

'మ‌ళ్లీ రావా', 'ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ' చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం 'మ‌సూద‌'. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడీ సినిమా నుంచి టీజర్ కూడా రిలీజైంది.

హీరో నాని ఈ సినిమా టీజర్‌ని ఆవిష్కరించాడు. టీజర్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. తొలి రెండు సినిమాలతో గౌతమ్ తిన్ననూరి, స్వరూప్‌లను టాలీవుడ్‌కు పరిచయం చేసిన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా.. హారర్ డ్రామా జోనర్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంతో సాయికిరణ్ అనే మరో డైరెక్టర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.

ఇక మసూద టీజర్ విషయానికొస్తే.. ఇందులో హీరోయిన్ కొన్ని మానసిక సమస్యలతో బాధపడుతుంది. ఆమెను డాక్టర్ కు చూపిద్దామా, పీర్ బాబాకు చూపిద్దామా అని తిరువీర్, సంగీత మాట్లాడుకుంటారు. ఈ గ్యాప్ లో సినిమాకు సంబంధించిన హారర్ ఎలిమెంట్స్ ను బ్యాక్ టు బ్యాక్ పరిచయం చేశారు. టీజర్ కు ప్రశాంత్ విహారి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ, కలర్ టిల్ట్ అన్నీ జానర్ కు తగ్గట్టు పెర్ ఫెక్ట్ గా ఉన్నాయి.

'గంగోత్రి' చిత్రంలో బాల‌న‌టిగా అల‌రించిన కావ్య క‌ల్యాణ్‌రామ్ ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మౌతోంది. సీనియర్ నటి సంగీత పాత్ర సినిమాలో కీలకం అంటున్నారు మేకర్స్. ఇప్పటికే హారర్ జానర్ లో చాలా సినిమాలొచ్చాయి. మరి ఈ సినిమా ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి.



First Published:  3 Aug 2022 6:30 AM GMT
Next Story