Telugu Global
Cinema & Entertainment

Masooda Trailer: అసలు భయం ముందుంది!

తెరపైకి మరో హారర్ థ్రిల్లర్ రాబోతోంది. దీని పేరు మసూద. ఈసారి కొత్తగా ఇందులో ఏం చూపించబోతున్నారు..?

Masooda Trailer: అసలు భయం ముందుంది!
X

'మళ్లీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన మూడో చిత్రం 'మసూద'. హారర్-డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశాడు.

ట్రైలర్ విషయానికి వస్తే.. భవిష్యత్ అనేది మనం ఈ రోజు ఏం చేస్తున్నామో అనేదానిపై ఆధారపడి ఉంటుంది.. అనే డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్.. అడుగడుగునా ఆసక్తికరంగా ఉంది. తల్లికూతుళ్ల మధ్య ప్రేమ, మధ్య తరగతి కుటుంబాల బాధలు, స్నేహం, ప్రేమ వంటి అన్ని కోణాలను టచ్ చేస్తూ నడిచిన ఈ ట్రైలర్.. ఒక్కసారిగా హారర్ ఎలిమెంట్స్‌తో భయపెట్టేస్తోంది.

'అప్పుడే భయపడాల్సిన అవసరం లేదు.. అస్సల్ భయం ముందుంది' అని చిత్ర బృందం చెబుతున్న తీరు చూస్తుంటే.. హర్రర్ ఎలిమెంట్స్ జస్ట్ టచ్ మాత్రమే చేశామని చెప్పకనే చెప్పేశారు. ఇక పూర్తి స్థాయిలో భయపడేందుకు నవంబర్ 18 వరకు వెయిట్ చేయకతప్పదు.

ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన ఎస్‌విసి బ్యానర్ ద్వారా విడుదల చేస్తున్నారు. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందించాడు.



First Published:  13 Nov 2022 4:32 AM GMT
Next Story