Telugu Global
Cinema & Entertainment

MaruthiNagar Subramanyam | అందరికీ థ్యాంక్స్ చెప్పిన రావురమేష్

MaruthiNagar Subramanyam - రావు రమేష్ లీడ్ రోల్ పోషించిన మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమా సక్సెస్ అయింది. అంతా కలిసి సంబరాలు చేసుకున్నారు.

MaruthiNagar Subramanyam | అందరికీ థ్యాంక్స్ చెప్పిన రావురమేష్
X

విలక్షణ నటుడు రావు రమేష్ లీడ్ రోల్ లో నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించాడు. స్టార్ డైరక్టర్ సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన ఈ చిత్రానికి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు.

రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ వంటి వారు నటించిన ఈ చిత్రం నిన్న థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు మీడియా నుంచి మంచి రివ్యూలు, ఆడియెన్స్ నుంచి మంచి మౌత్ టాక్ రావడంతో యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

"మిడిల్ క్లాస్ స్క్రిప్ట్ ఎంచుకోవడం తప్పా? అని అనుకున్నాను. మిడిల్ క్లాస్ ఎక్కువగా కాంప్రమైజ్ అవుతుంది. వాళ్లను కించపర్చకుండా ఈ సినిమాను లక్ష్మణ్ గొప్పగా తీశాడు. కామెడీ కోసం వాళ్లని కించపర్చకూడదు. ఈ సినిమా బ్యూటీ అదే. సింప్లిసిటీగా ఉండి.. బ్యూటీఫుల్‌గా సినిమాను తీయడం గొప్ప విషయం." అని అన్నారు రావు రమేష్.

ఈ సినిమా సక్సెస్ తన ఒక్కడి వల్ల కాదని, అన్ని పాత్రలు బాగా కుదిరాయని, అందుకే సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు రావు రమేష్. ఈ సందర్భంగా సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు.

First Published:  24 Aug 2024 5:08 PM GMT
Next Story