Telugu Global
Cinema & Entertainment

Market Mahalakshmi | ఈవిడ మార్కెట్ మహాలక్ష్మి

Market Mahalakshmi - పార్వతీశం మరో సినిమాతో రెడీ అయ్యాడు. ఈసారి ఇంకో కొత్త కాన్సెప్ట్ ఎంచుకున్నాడు.

Market Mahalakshmi | ఈవిడ మార్కెట్ మహాలక్ష్మి
X

కేరింత మూవీ ఫేమ్ హీరో పార్వతీశం, కొత్తమ్మాయి ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు.


ఈ మూవీ 'కాన్సెప్ట్ మోషన్ పోస్టర్' ని డైరెక్టర్ & రైటర్ 'బివిఎస్ రవి' ట్విట్టర్ ద్వారా డిజిటల్ లాంచ్ చేశాడు. గతంలో హీరో పార్వతీశం తన మూవీస్ తో ప్రేక్షకులని అలరించాడని 'మార్కెట్ మహాలక్ష్మి' తో మంచి సక్సెస్ అందుకోవాలంటూ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.


ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్, రైతుబజార్లో కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని ఎందుకు ఇష్టపడతాడు.. ఆ అమ్మాయి కోసం ఏం చేశాడనే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మిష్టర్ జో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.


ఇప్పటివరకు తెలుగుతెరపై ఇలాంటి కాన్సెప్ట్ రాలేదంటున్నారు మేకర్స్. స్టోరీలైన్ వినడానికి ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, ఇందులో చాలా మలుపులున్నాయని, ఫన్ తో పాటు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు. త్వరలోనే టీజర్ రిలీజ్ చేయబోతున్నారు.




First Published:  31 Jan 2024 4:58 PM GMT
Next Story