Telugu Global
Cinema & Entertainment

Manushi Chhillar: వరుణ్ తేజ్ సరసన మిస్ వరల్డ్

Manushi Chhillar and Varun Tej’s New Movie: వరుణ్ తేజ్ కొత్త సినిమా కోసం మానుషి చిల్లర్ ను తీసుకున్నారు. ఈమె మాజీ మిస్ వరల్డ్.

Manushi Chhillar: వరుణ్ తేజ్ సరసన మిస్ వరల్డ్
X

కొన్ని నెలల క్రితం వరుణ్ తేజ్ హీరోగా, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఓ సినిమాను ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. యదార్థ ఘటనల ఆధారంగా వస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో ఎయిర్ ఫోర్స్ పైలట్ గా కనిపించనున్నాడు వరుణ్ తేజ్.

ఇప్పుడీ సినిమాకు మరో ఎట్రాక్షన్ తోడైంది. ఈ పాన్ ఇండియా మూవీ కోసం మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. 2017లో మిస్ వరల్డ్ టైటిల్ అందుకున్న మానుషి, అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సామ్రాట్ పృధ్వీరాజ్ సినిమాతో హీరోయిన్ గా మారింది.

"యాక్షన్‌తో నిండిన ఈ అద్భుతమైన సినిమా భాగమైనందుకు, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్‌తో కలిసి పని చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నాపై నమ్మకం వుంచిన దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడాకి కృతజ్ఞతలు. వరుణ్ తేజ్‌తో స్క్రీన్ స్పేస్ పంచుకోవడం ఎక్సయిటింగ్ గా ఉంది’’ అంటూ రియాక్ట్ అయింది మానుషి.

ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్, VFX లో దిట్ట అయిన శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈరోజు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది.



First Published:  3 March 2023 3:37 PM GMT
Next Story