Telugu Global
Cinema & Entertainment

Double Ismart | మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్

Double Ismart - డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం మరో సెంటిమెంట్ రిపీట్ చేశాడు పూరి జగన్నాధ్. మణిశర్మను సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు.

Double Ismart | మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్
X

సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, మెలోడీ బ్రహ్మ మణిశర్మలది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. పోకిరి, చిరుత, ఇస్మార్ట్ శంకర్ చిత్రాలు చార్ట్ బస్టర్ ఆడియో, బాక్సాఫీస్ హిట్స్ గా నిలిచాయి. ఉస్తాద్ రామ్ పోతినేనితో దర్శకుడు పూరీ జగన్నాధ్ చేస్తున్న తాజా చిత్రం 'డబుల్ ఇస్మార్ట్' కోసం ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మరోసారి కలిసింది.

ఇస్మార్ట్ శంకర్ మ్యూజికల్ గా పెద్ద హిట్ అయ్యింది. సీక్వెల్ కచ్చితంగా చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది.

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాకు సంబంధించి రామ్, సంజయ్ దత్ లుక్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో సంజయ్ దత్, అల్ట్రా మోడ్రన్ గా కనిపించబోతున్నాడు.

పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మణిశర్మ ఇప్పటికే పని మొదలుపెట్టాడు. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో ఈ సినిమా రాబోతోంది. శివరాత్రి కానుకగా మార్చి 8న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

నిజానికి ఇస్మార్ట్ శంకర్ తర్వాత మణిశర్మ కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాడు. భారీ మ్యూజికల్ హిట్స్ అందించలేకపోయాడు. కాబట్టి ఈ సినిమా అతడికి కూడా కీలకమే. తన సీనియారిటీని నిలబెట్టుకోవాలన్నా, మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలన్నా డబుల్ ఇస్మార్ట్ హిట్ అవ్వాల్సిందే.

First Published:  25 Nov 2023 2:36 PM GMT
Next Story