Telugu Global
Cinema & Entertainment

PS2 Movie: విడుదల తేదీ ఫిక్స్

PS2 Movie: మణిరత్నం కలల ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్. పార్ట్-1తో తన కలను సాకారం చేసుకున్న మణిరత్నం, ఇప్పుడు పార్ట్-2 విడుదల తేదీని కూడా ప్రకటించారు.

PS2 Movie: విడుదల తేదీ ఫిక్స్
X

ఇండియ‌న్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌ను ఆవిష్క‌రించిన డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం. ఈయ‌న దర్శకత్వంలో వ‌చ్చిన‌ విజువ‌ల్ వండ‌ర్ 'పొన్నియిన్ సెల్వన్ (పీఎస్1)'. విక్ర‌మ్‌, జ‌యం ర‌వి, కార్తి, ఐశ్వ‌ర్యా రాయ్, త్రిష‌, శ‌ర‌త్ కుమార్‌, ప్రకాష్ రాజ్‌,శోభితా దూళిపాళ‌, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి, జ‌య‌రాం త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

మ‌ద్రాస్ టాకీస్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా రూపొందించిన పొన్నియిన్ సెల్వ‌న్‌ చిత్రాన్ని సుభాస్క‌ర‌న్‌, మ‌ణిర‌త్నం నిర్మించారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా విడుద‌ల‌ైంది. మొదటి భాగం మంచి ఆదరణ దక్కించుకుంది.

ఇప్పుడు పొన్నియిన్ సెల్వ‌న్ 2 చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 28న 5 భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా పొన్నియిన్ సెల్వ‌న్ 2ను రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

పొన్నియిన్ సెల్వ‌న్ పార్ట్ 1 ప్ర‌పంచవ్యాప్తంగా రూ.500 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించి స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది. ఈ రికార్డుల్ని పొన్నియిన్ సెల్వ‌న్ 2 తుడిచిపెడుతుందని భావిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

First Published:  29 Dec 2022 3:28 AM GMT
Next Story