Telugu Global
Cinema & Entertainment

Mangalavaaram | మంగళవారం మూవీ విడుదల తేదీ

Mangalavaaram Movie - అజయ్ భూపతి తాజా చిత్రం మంగళవారం. ఈ సినిమా విడుదల తేదీ లాక్ చేశారు.

Mangalavaaram | మంగళవారం మూవీ విడుదల తేదీ
X

ఆర్ఎక్స్ 100', 'మహా సముద్రం' చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా 'మంగళవారం'. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్ ఓ ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు దర్శక, నిర్మాతలు ప్రకటించారు.

చిత్ర దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ''గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ 'మంగళవారం'. సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. ఎవరు మంచి? ఎవరు చెడు? అనేది కనిపెట్టలేని విధంగా కథనం ముందుకు వెళుతుంది. క్యారెక్టర్స్ మీద బేస్ చేసుకుని తీసిన సినిమా. పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్ చూస్తే షాక్ అవుతారు. థియేటర్లలో ప్రేక్షకులకు డిఫరెంట్ థ్రిల్ అందించే సినిమా ఇది. నవంబర్ 17న థియేటర్లలో 'మంగళవారం' విడుదల అవుతుంది'' అని అన్నారు.

ఇదొక డిఫరెంట్ ప్రయత్నం అంటున్నారు మేకర్స్. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ ట్రై చేయని విధంగా అజయ్ భూపతి ఈ సినిమా తీశాడట. నవంబర్ 17న థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఆ మాటే చెబుతారంటున్నారు. 99 రోజులు షూటింగ్ చేయగా, అందులో 51 రోజులు రాత్రివేళల్లో షూట్ చేశారు.

ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. 'కాంతార'తో పాపులరైన అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 'విక్రమ్ వేద', 'కాంతార', 'విక్రాంత్ రోణ', 'సలార్' తదితర చిత్రాలకు పని చేసి, 'రంగస్థలం'తో నేషనల్ అవార్డు అందుకున్న ఎంఆర్ రాజా కృష్ణన్ 'మంగళవారం' చిత్రానికి సౌండ్ డిజైనర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.

First Published:  26 Sep 2023 5:40 PM GMT
Next Story