Telugu Global
Cinema & Entertainment

Kannappa | న్యూజిలాండ్ లో మొదలైన మంచు విష్ణు సినిమా

Kannappa Movie - మంచు విష్ణు కలల ప్రాజెక్టు కన్నప్ప. ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్ లో మొదలైంది.

Kannappa | న్యూజిలాండ్ లో మొదలైన మంచు విష్ణు సినిమా
X

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ భక్త కన్నప్ప. ఈ సినిమా ప్రయాణం న్యూజిలాండ్‌లో ప్రారంభం అయింది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు.

మంచు విష్ణు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ కూడా ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్న విషయం తెలిసిందే.

పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్రానికి రచయితలు. ఈ సినిమా షూట్‌కు సంబంధించిన ప్రకటనను మంచు విష్ణు ట్వీట్ చేశారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను తెరకెక్కించే క్రమంలో తోడ్పడుతున్న ప్రతీ ఒక్కరికీ ఆయన థాంక్స్ చెప్పాడు.

"న్యూజిలాండ్‌లోని అద్భతమైన లోకేషన్లలో కన్నప్ప షూటింగ్‌ను ప్రారంభిస్తున్నాం. ఆ శివపార్వతుల ఆశీస్సులతోనే ఏడేళ్ల నా శ్రమ, కల నిజం కాబోతోంది. ఈ సినిమా కోసం గత 8 నెలలుగా టీం అంతా కూడా నిద్రలేని రాత్రులు గడిపింది. పండుగలు, పబ్బాలు కూడా మరిచిపోయి పని చేశాం. కనీసం రోజుకు 5 గంటల నిద్ర కూడా ఉండేది కాదు."

కన్నప్ప సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా 600 మంది పనిచేస్తున్నట్టు వెల్లడించాడు విష్ణు. ఈ సినిమాలో పలు భాషలకు చెందిన సూపర్ స్టార్లు నటించబోతున్నారని, ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని తెలిపాడు.

First Published:  26 Sep 2023 4:33 AM GMT
Next Story