Telugu Global
Cinema & Entertainment

Kannappa First Look | కన్నప్ప.. ది వారియర్

Kannappa Movie - మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. కన్నప్పను యోధుడిగా చూపించే ప్రయత్నం జరిగింది.

Kannappa First Look | కన్నప్ప.. ది వారియర్
X

హీరో విష్ణు మంచు విభిన్న చిత్రాలకు, ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటారు. కెరీర్ ప్రారంభం నుంచి కూడా ఆయన కొత్త కథలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ఆయన ఖాతాలో ఢీ, దేనికైనా రెడీ వంటి హాస్యభరిత చిత్రాలున్నాయి. మాస్ కమర్షియల్ యాక్షన్ చిత్రాల్లోనూ విష్ణు మెప్పించారు. ప్రస్తుతం ఆయన కన్నప్ప అంటూ పాన్ ఇండియా వైడ్‌గా సందడి చేసేందుకు సిద్దం అవుతున్నారు.

ప్రస్తుతం కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్‌లో జరుగుతోంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. డ్రీమ్ ప్రాజెక్ట్‌ కావడంతో ఈ కన్నప్ప సినిమాను విష్ణు మంచు ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నారు. ఇక అన్ని ఇండస్ట్రీల నుంచి సూపర్ స్టార్లు కన్నప్ప చిత్రంలో నటిస్తుండటంతో భారీగా క్రేజ్ నెలకొంది. మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, ప్రభాస్, శరత్ కుమార్ వంటి స్టార్లు కన్నప్పలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

విష్ణు మంచు పుట్టిన రోజు (నవంబర్ 23) సందర్భంగా కన్నప్ప చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రివీల్ చేశారు. పోస్టర్ లో కన్నప్పను యోధుడిగా చూపించారు. ఓ యోధుడు, అపర భక్తుడిగా ఎలా మారాడో కన్నప్ప సినిమాలో చూపించబోతున్నారు.

ఈ సినిమాకు సంబంధించి దాదాపు షూటింగ్ మొత్తాన్ని న్యూజిలాండ్ లో పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. కొంత భాగాన్ని మాత్రం ఇండియాలో తీస్తారు. వీరుడిగా ఉన్న కన్నప్ప, అపర శివభక్తుడిగా ఎలా మారాడనే విషయాన్ని కన్నప్ప సినిమాలో చూపించబోతున్నారు.




First Published:  23 Nov 2023 4:47 PM GMT
Next Story