Telugu Global
Cinema & Entertainment

మంచు మూడో తరం కూడా రెడీ

మంచు విష్ణు కవల పిల్లలు ఇండస్ట్రీలోకి ఎంటరయ్యారు. మంచు మూడో తరంగా పరిశ్రమకొచ్చిన ఈ పిల్లలు జిన్నా సినిమాలో ఓ పాట పాడారు.

మంచు మూడో తరం కూడా రెడీ
X

మంచు మోహన్ బాబు మనవరాళ్లు, హీరో విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా సింగర్స్ గా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. తండ్రి విష్ణు మంచు హీరోగా నటించిన 'జిన్నా' చిత్రంలో ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో సాగే పాటను ఈ ట్విన్ సిస్టర్స్ ఆలపించారు. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు.

'ఇదే స్నేహం...' అంటూ సాగే ఈ పాట వీడియోను కూడా విడుదల చేశారు. మంచు సిస్టర్స్ పాడిన ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది.

ప్రముఖ సంగీత దర్శకులు యం.యం.కీరవాణి, కోటి, దేవిశ్రీప్రసాద్, తమన్, అచ్చు రాజామణి ... సింగర్స్ మనో, గీతామాధురి తదితరులు ఈ మంచు సిస్టర్స్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ సంగీత ప్రపంచంలోకి వెల్ కమ్ చెప్పారు.

మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోంది 'జిన్నా' సినిమా. ఈ మూవీకి కోన వెంకట్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. కథ, స్క్రీన్ ప్లే సమకూర్చి పెట్టాడు. మూల కథ మాత్రం జి.నాగేశ్వరరెడ్డి అందించారు.

ఈ సినిమాతో సన్నీ లియోన్, టాలీవుడ్ కు ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా పరిచయమౌతోంది. గతంలో గరుడవెగ లాంటి సినిమాల్లో ఐటెంసాంగ్ చేసిన ఈ బ్యూటీ, జిన్నాలో హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది.



First Published:  26 July 2022 11:04 AM GMT
Next Story