Telugu Global
Cinema & Entertainment

Kannappa | మంచు విష్ణు ఫస్ట్ లుక్ రిలీజ్

Kannappa Movie - మంచు విష్ణు నటిస్తున్న భక్తిరస చిత్రం కన్నప్ప. ఈ సినిమా నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

Kannappa | మంచు విష్ణు ఫస్ట్ లుక్ రిలీజ్
X

మహాశివరాత్రి కానుకగా "కన్నప్ప" ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. కన్నప్పగా విష్ణు మంచు అందరినీ ఆకట్టుకునేలా ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాడు. శివభక్తుడిగా మాత్రమే కాకుండా, వీరుడిగా కూడా కన్నప్పను ప్రజెంట్ చేస్తూ ఈ ఫస్ట్ లుక్ రిలీజైంది.

"కన్నప్ప" ఓ దృశ్యకావ్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక ధైర్యవంతుడైన యోధుడు, శివుని భక్తుడైన కన్నప్ప కథను తెరపైకి తీసుకొస్తున్నారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు ఇది.

కన్నప్పపై భారీ అంచనాలుండగా.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మరింత బజ్ పెరిగింది. ఈ భక్తిరస చిత్రాన్ని, మంచు విష్ణు ఈ తరానికి ఎలా చూపించబోతున్నాడనే ఆసక్తి అందర్లో ఉంది. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లంతా సినిమాలో ఏఏ పాత్రల్లో కనిపించబోతున్నారనే ఆసక్తి కూడా అందర్లో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ న్యూజిలాండ్ లో నడుస్తోంది. దాదాపు 90 శాతం సినిమాను న్యూజిలాండ్ లోనే పూర్తిచేయబోతున్నారు.




First Published:  9 March 2024 4:45 AM GMT
Next Story