Telugu Global
Cinema & Entertainment

What The Fish - కొత్త సినిమా ప్రకటించిన మంచు మనోజ్

Manchu Manoj - ఆరేళ్ల విరామం తర్వాత మరోసారి ముఖానికి రంగేసుకోబోతున్నాడు మంచు మనోజ్. అతడు ఈరోజు కొత్త సినిమా ప్రకటించాడు.

What The Fish - కొత్త సినిమా ప్రకటించిన మంచు మనోజ్
X

ఆరు సంవత్సరాల విరామం తర్వాత, మంచు మనోజ్ కొత్త సినిమా ప్రకటించాడు. ఈరోజు అధికారికంగా తన ట్విట్టర్ పేజీ ద్వారా సినిమా ఎనౌన్స్ చేశాడు. గతంలో కంటే ఎక్కువ ఎనర్జీతో తిరిగి వస్తున్నానంటూ.... 'వాట్ ది ఫిష్' అనే ఆసక్తికరమైన టైటిల్ తో సినిమాను ప్రకటించాడు. ఈ చిత్రానికి వరుణ్ దర్శకుడు. కథ, స్క్రీన్‌ప్లే కూడా అతడిదే.

ఈ సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేశాడు. ఈ ఆసక్తికరమైన పోస్టర్‌ లో చాలామంది తెలియని వ్యక్తులను ఎదుర్కోవటానికి మనోజ్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. గోగల్ మాస్క్‌ తో ఉన్న అమ్మాయి క్యారికేచర్ చిత్రాన్ని కూడా చూపిస్తుంది. బ్యాక్ పోజ్‌లో మనోజ్ ఫిట్‌ గా కనిపిస్తున్నాడు.

పోస్టర్ చూస్తుంటే.. మనోజ్ మేకోవర్ అయినట్టు కనిపిస్తోంది. అతని కొత్త గెటప్‌ను చూడటానికి మరికొంత సమయం వేచి చూడాల్సిందే. 'మనం మనం బరంపురం'' అనేది సినిమా ట్యాగ్ లైన్. ఇదొక డార్క్ కామెడీతో కూడిన యాక్షన్-థ్రిల్లర్.

ఈ సినిమా షూటింగ్ ను టొరంటో నగరంతో పాటు, కెనడాలోని వివిధ ప్రదేశాల్లో ప్లాన్ చేశారు. మొత్తంగా 75 రోజుల పాటు షూట్ చేస్తారు. 6ix సినిమాస్ బ్యానర్‌పై రాకింగ్ స్టార్ మనోజ్ హీరోగా తెరకెక్కనున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు సంబధించి మరిన్ని వివరాలు త్వరలోనే రాబోతున్నాయి.




First Published:  20 Jan 2023 4:00 PM GMT
Next Story